అత్యంత పాశవికంగా హత్య చేయబడ్డ శంషాబాద్ పశు వైద్యురాలు దిశా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితులకు కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి నలుగురిని వేరు వేరు గా నాలుగు సెల్లుల్లో వేశారు.

 

ఇక ఈ నేపథ్యంలో మీడియాకు, జైల్లో నిందితులు కీలక విషయం వెల్లడించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జైల్లో నిందితుడు ఆరీఫ్ సెల్లుకు కాపలాగా వుండే జవాన్లు ఆరీఫ్ తో మాటామాటా కలిపి కీలక విషయాన్ని రాబట్టారు. "సారు మేము దిశా ను బ్రతికుండగానే కాల్చేశాం" అంటూ జైలు సిబ్బందితో ఏమాత్రం భయం, బెరుకు లేకుండా ప్రధాన నిందితుడు ఆరీఫ్ కీలక విషయం వెల్లడించాడు.

 

తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మానుష్య ప్రాంతానికి దిశాను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. అత్యాచారం చేసే సమయంలో ఆమె అరవకుండా ఉండడానికి నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు ఆమె నోట్లో మద్యం పోయడంతో దిశా స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను లారీలో ఎక్కించి మార్గం మధ్యలో కూడా అత్యాచారానికి పాల్పడ్డారు ఈ నీచులు. స్పృహ తప్పి, అపస్మారక స్థితిలో ఉన్న దిశాపై పెట్రోల్ పోసి నిప్పటించారు నిందితులు. దీనితో పోలీసులకు నిందితులు, హత్య చేసిన తరువాతే దిశను కాల్చేశామంటూ చెప్పిన విషయం అబద్ధం అని తెలుస్తోంది. నిందితులు ఇంత పాశవికమైన ఘటనకు పాల్పడిన తరువాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం కనపడట్లేదు అని జైలు సిబ్బంది వెల్లడించినట్లు సమాచారం. ఏమాత్రం జాలి లేకుండా అత్యంత దారుణంగా బాధితురాలిని సజీవ దహనం చేసిన నిందితులకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరణ శిక్ష అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: