విలాస పురుషుడు, వివాదాస్ప‌ద స్వామీ నిత్యానంద మ‌రో సంచ‌ల‌నంతో తెర‌మీద‌కు వ‌చ్చాడు.  అహ్మదాబాద్‌లోని మరో ఆశ్రమంలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతో ఇటీవ‌ల ఆయ‌న మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచాడు. ఇలా తనపై నమోదైన లైంగికదాడి కేసును తప్పించుకొనేందుకు పాస్‌పోర్టు లేకుండా దేశం వదిలి పారిపోయిన నిత్యానంద సంచ‌ల‌న ట్విస్ట్ ఇచ్చాడు. సెంట్రల్‌ అమెరికాలో ఈక్వెడార్‌కు సమీపంలో ఒక రాజ్యాన్ని స్థాపించినట్టు ప్రకటించాడు. ఇక్క‌డితోనే నిత్యానంద ఏశాలు ఆగిపోలేదు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశాడు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం.

 

ఈక్వెడార్‌కు సమీపంలోని ఒక దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద, దానిని నూతన స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నాడు. `కైలాస` అని ఈ దేశానికి పేరు పెట్టారు. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారట‌. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేశారు.మెరూన్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. కొత్త దేశం పేరిట వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించాడు. గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్‌సైట్‌ పేర్కొంది. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్‌ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి.

 

ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని,దాని పేరు కైలాస అని, తమకు ప్రత్యేక పాస్‌పోర్టు ఉందని తెలిపాడు.నిత్యానంద తమది ఈ ప్రపంచంలోనే గొప్ప హిందూ దేశం అని చెప్పుకున్నాడు. అయితే, ఇక్క‌డే నిత్యానంద మ‌రిన్ని ట్విస్టులు ఇచ్చాడు తనదేశంలో పౌరసత్వం పొందాలని ఆహ్వానం పలుకుతున్న నిత్యానంద అదే సమయంలో పరిపాలన సాగించేందుకు విరాళాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: