తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాదాద్రి నరసింహస్వామి దేవాలయం తెలంగాణ తిరుపతిగా మార్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో  యాదాద్రిని  అభివృద్ధి చేసే పనులు చేపడుతుంది తెలంగాణ సర్కార్. అయితే తెలంగాణ సర్కార్ యాదాద్రి అభివృద్ధి కోసం చేపట్టిన పనిలో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. స్వయంభూ వెలసిన నరసింహ స్వామి విగ్రహానికి బదులు వేరే విగ్రహాన్ని చెక్కి రూపొందించారు అంటూ నిరసన వెల్లువెత్తుతుంది. అయితే స్వయంభూగా వెలిసిన మూలవిరాట్ను చెక్కితే  అది ముమ్మాటికీ తప్పు అంటూ ఆగమ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

 

 

 దీంతో మరో వివాదం యాదాద్రి పునర్నిర్మాణంలో  తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కుంకుమ తొలగిస్తే దేవుడి అసలు రూపం కనిపిస్తుందని ఆగమ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి వైటిడిఏ అధికారులు సమావేశంలో ప్రకటించారు. బేగంపేట్ టూరిజం ప్లాజా లో ఈ సమావేశం నిర్వహించారు వైటిడిఏ అధికారులు. అయితే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ చెన్నైలోని మాజీ స్థపతి  సుందర్ కు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి అంటూ  వస్తున్న వార్తలపై స్పందించారు యాదాద్రి అధికారులు. 

 

 

 కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ  తిరుపతిగా  నెలకొంటున్న   తెలంగాణ యాదాద్రిని  రాష్ట్రంలో రెండవ తిరుపతిగా మార్చేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఎన్నో రోజులుగా ఆలయ పునర్నిర్మాణం కోసం  ఎన్నో నిధులు కేటాయిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే యాదాద్రి క్షేత్రం లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఆలయ పునర్నిర్మాణం  కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆలయం అభివృద్ధిలో భాగంగా  పలు వివాదాలు తర్వాత మరోసారి ఇంకో వివాదం తెరమీదకి వచ్చింది.కాగా ఆలయ పునర్నిర్మాణం లో ఇప్పటికే ఎన్నో  విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: