2020లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు కమలా హారిస్‌. ఐతే...ప్రజల కోసం చేసే తన పోరాటం మాత్రం అగదని తెలిపారు కమలా హారిస్.  

 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో జరగనున్నాయి. ఈ ఎన్నికల బరి నుంచి డెమోక్రటిక్‌ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె గత మంగళవారంతో ముగించారు. తన మద్దతుదారులకు ఇది చాలా విచారకరం అని తెలిపారు కమలా హారిస్. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను అని కమలా హ్యారిస్‌ స్పష్టంచేశారు. తను తీసుకున్న నిర్ణయం చాలా కష్టతరమైందని చెప్పారు కమలా హారిస్. 

 

డెమోక్రటిక్‌ పార్టీలో కీలక నేతగా మారిన కమలా హ్యారీస్‌ ఒకానొక సమయంలో అధ్యక్ష పదవికి ప్రముఖ పోటీదారుగా నిలిచారు. అయితే తను అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి ఆర్థిక ఒత్తిళ్లే కారణమని హారిస్ తెలిపారు. తను బిలియనీర్‌ను కాదని చెప్పారు. సొంత ప్రచారానికి నిధులు సమకూర్చుకునే పరిస్థితుల్లో లేనని వివరించారు. ప్రచారం కొనసాగుతున్న కొద్దీ, మనం పోటీ పడటానికి అవరసరమైన నిధులు సేకరించడం కష్టంతో కూడుకున్న పని అని అమె తన మద్దతుదారులకు తెలిపారు. న్యూయార్క్‌ మేయర్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్‌ రంగంలోకి దిగిన తర్వాత హ్యారిస్‌కు మద్దతు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సెనెటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్‌ చరిత్రకెక్కారు.

 

కమలా హారిస్‌ అమెరికా అధ్యక్ష బరి నుంచి వైదొలగడంపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. ఇది చాలా బాధ కలిగించే అంశమని...నిన్ను మేం కోల్పోతున్నాం కమలా? అంటూ ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలకు కమలా ధీటుగానే సమాధానం ఇచ్చారు. ప్రెసిడెంట్‌...చింతించాల్సిన అవసరం లేదని...మీపై జరిగే విచారణలో కలుస్తా'' అంటూ చురకలంటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో ఫోన్ సంభాషణల విషయంలో ట్రంప్‌ అభిశంసన విచారణ ఎదుర్కొంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: