డియర్ కామ్రేడ్ వంటి డిజాస్టర్ తర్వాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. 'డియర్ కామ్రేడ్' ఫ్లాపయినప్పటికీ ఈ కొత్త సినిమాపై యూత్ లో ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ పాత్ర గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

 

సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది.. ఎప్పుడు విడుదల అవుతుందని ఎదురు చూస్తున్నవిజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. అదే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిందని సమాచారం. ఈ వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఇక ఈ సినిమా లో విజయ్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ముందునుంచి చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో విజయ్ ఒక రచయిత గా కనిపిస్తాడని తాజా సమాచారం. విజయ్ ఒక మంచి బుక్ రాసే ప్రయత్నం లో ఉంటాడని.. ఆ కథలో ఉండే పాత్రలతోనే సినిమా నడుస్తుందని అంటున్నారు.

 

వాస్తవంగా ఈ న్యూస్ ఇంతకముందే బయటకు వచ్చింది. ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఇంతమంది హీరోయిన్లు అంటే వీరిలో ఎవరు విజయ్ రాసే కథలో ఉన్న పాత్రలో.. ఎవరు నిజ జీవిత పాత్రలో.. నటిస్తున్నారో సినిమా చూస్తే కానీ తెలీదు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ ఇలానే కొనసాగుతుంది.

 

ఇక విజయ్ నటించే ప్రతి సినిమాలోనూ తన ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ గానే ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా కూడా దాదాపుగా విజయ్ కంట్రోల్ లోనే జరిగిందని.. విజయ్ స్టైల్ లోనే సినిమా సాగుతుందని అంటున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమాను కె.ఎ వల్లభ నిర్మిస్తుఉండగా.. కె యస్ రామారావు సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు. 'ఓనమాలు'.. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి అభిరుచిగల సినిమాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజైన విజయ్ లుక్స్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. విజయ్ కూడా ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ తో సెట్స్ పైకి వెళ్ళనున్నాడు విజయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: