అభాగ్యురాలిని అత్యంత దారుణంగా లైంగికదాడి, హత్యకు గురి చేసిన మాన‌వ మృగాల బుద్ధి మార‌లేదు. దిశ విషాదాంతానికి కారకులైన నిందితులకు కఠినంగా శిక్షించాలని, ఆడపిల్లలను రక్షించుకొని సృష్టిని కాపాడుకోవాలని నినదిస్తూ చ‌ట్ట‌స‌భ‌లతో సహా దేశ‌వ్యాప్తంగా నినాదాలు హోరెత్తుతున్నాయి. దిశ నిందితులకు వెంటనే కఠినశిక్షలు అమలుచేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టును కోరుతున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో...చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో ఉన్న నిందితుల గురించి అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. దిశ కేసులో బాధిత కుటుంబసభ్యులకు సత్వర న్యాయం అందించేందుకు, నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసింది. ఇప్ప‌టికే జ‌స్టిస్ ఫర్ దిశ కేసులో నిందితులకు షాద్‌నగర్ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. అయితే, నిందితుల్లో ఏమాత్రం మార్పు రాలేద‌ని తెలుస్తోంది.

 

దిశ నిందితులు ఆరిఫ్ అలీ, చెన్నకేశవులు, శివ, నవీన్ ప్రస్తుతం చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌లలో ఉన్నారు. నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఈ మేరకు ఏడు రోజుల క‌స్ట‌డీకి అనుమతి ఇచ్చింది. దిశ కేసుకు సంబంధించి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీంతో జైలులోనే విచారిస్తారా లేదా ఏదైనా రహస్య ప్రాంతానికి తీసుకువెళ్తారా? అనేది పోలీసుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సమాచారం. 

 


నిందితులను కస్టడీకి ఇచ్చినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వారిని కోర్టుకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఉంది. దిశకు న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో వారి భద్రతపై పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. దీంతో చర్లపల్లి జైలు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి ఇస్తే… కోర్టులోనే ఐడెంటిటీ పరేడ్ నిర్వహించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, త‌మ‌ను విచార‌ణ‌కు బ‌య‌ట‌కు తీసుకువెళ్ల‌వ‌ద్ద‌ని నిందితులు కోరుతున్న‌ట్లు స‌మాచారం. జైల్లోనే విచారించాలని కోరిన‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: