గడచిన కొద్ది రోజులుగా జనసేన అధినేత   పవన్ కల్యాణ్  వైఖరి చూస్తుంటే రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడన్న విషయం అర్ధమైపోతుంది. అందుకనే జనసేన దుకాణం కట్టేసి వెంటనే సినిమాల్లోకి వెళిపోతే బాగుంటుందేమో. ఎందుకంటే మంచో చెడో ఎవరి ప్రాపకంతోనో పవన్ హీరోగా సెటిలయ్యాడు. హీరోగా ఎంత స్ధిరపడ్డాడో రాజకీయాల్లో అంతగా ఫెయిలైన విషయం అందరూ చూస్తున్నదే.

 

రాజకీయ నేతగా లేకపోతే ఓ పార్టీ అధినేతగా ఉండాల్సిన ఏ ఒక్క లక్షణమూ పవన్ లో కనబడదు. ఇరవై నాలుగు గంటలూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలన్న ఏకైక టార్గెట్ తో రాజకీయాలు  చేస్తున్నాడు. ఒక వ్యక్తిమీద ధ్వేషంతో ఎన్ని  రోజులు రాజకీయాలు చేస్తాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఏ విషయంపైన కూడా సాధికారత లేదు. సంపూర్ణ పరిజ్ఞానం ఉండదు. పవన్ లో ఉన్నదల్లా మిడిమిడి జ్ఞానమనే విషయం అందరికీ తెలిసిపోయింది. బహిరంగ సభల్లో మైకు పట్టుకుని తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఎందుకు ఊగిపోతాడో తెలీదు. ఎవరిని ఎందుకు తిడతాడో తెలీదు. ఒక విషయం మొదలుపెట్టి వెంటనే సంబంధం లేని ఇంకేదో విషయాన్ని ప్రస్తావించేస్తుంటాడు. అసలు ఏ విషయంపై పవన్ మాట్లాడుతున్నాడో అర్ధంకాక జనాలు, మీడియా బుర్రలు గోక్కున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

 

ఇవన్నీ చూస్తుంటే రాజకీయాల్లో పవన్ ఇంతకన్నా మెరుగ్గా రాణించలేడన్న విషయం తెలిసిపోతోంది. పైగా ఆయన మాటలు వింటుంటే మానసిక పరిస్ధితి మీద కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి  వీలైనంత తొందరగా జనసేనను బిజెపిలో విలీనం చేసేయటమే బెటర్ అని అందరూ అనుకుంటున్నారు.

 

రాజకీయాలను వదిలిపెట్టేసి తనకు అచ్చొచ్చిన సినిమాల్లోకే వెళ్ళిపోతే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడైతే డైరెక్టర్ చెప్పినట్లు  నటిస్తే సరిపోతుంది. మామూలు జనాలు ఇష్టపడితే సినిమాను చూస్తారు లేకపోతే లేదంతే. రాజకీయాల్లో ఉన్నంత వరకూ మతిలేని ప్రసంగాలను మీడియాకు చూపక తప్పదు..జనాలకు భరించకా తప్పదు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జనసేన దుకాణం కట్టేస్తే అందరికీ  మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: