పవన్ కళ్యాణ్  మొదట్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయమై వైవిధ్య మరియు యూత్ ని ఆకట్టుకునే సినిమాలు తీస్తూ  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్న ఇతను  కొత్త పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మొదట్లో తన అన్న చిరంజీవి  పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లో పనిచేసి దాన్ని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేసిన తరువాత  తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా ఏర్పరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి అతడే పార్టీ పెట్టి  తరువాత టీడీపీ కి తన మద్దతిస్తూ టీడీపీ మరియు బీజేపీ మరియు జనసేన ల కలయికతో రాష్ట్రంలోటీడీపీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం  మనకందరికి తెలిసినదే.

తరువాత టీడీపీ బీజేపీ తో పొత్తును  తెంచుకోవడం అంతలోనే ఎన్నికలు రావడం జనసేన కూడా ఎన్నికల బరిలో దిగడం తో ఎవరికీ వారే అన్నట్లు ఎన్నికలలో పోటీచేశారు అది కూడా తెలుసు. జనసేనకు మొత్తం రాష్ట్రంలో ఒకటే శాసన సభ సీటు రావడం అందులో పవన్ కళ్యాణ్ పోటీచేసిన చోట ఓడిపోవడం  పార్టీ ప్రతిష్టను మరియు  పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసింది. అంతకు ముందు మరియు ఎప్పుడు బీజేపీ ని ఒక్క మాట కూడా అనని పవన్ కళ్యాణ్   ప్రత్యేక హోదా, మరికొన్ని అంశాల్లో మాత్రమే బీజేపీతో విభేదించానని, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అంటే తనకు ఇష్టమని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం లో కొత్త అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తున్నారు అన్న వార్త చక్కర్లు కొడుతుంది.

ఈ మద్యే పవన్ ఢిల్లీ కి వెళ్లి మంతనాలు జరిపారని ఈ మధ్య చేస్తున్న ర్యాలీ లో కూడా అమిత్ షా ని పొగడడం బీజేపీ ప్రభుత్వం ఏపీ కి ఏమి ఇవ్వలేదని టీడీపీ అంటుంటే దానిని పవన్ తోసిపుచ్చడం చూస్తే ప్రతిఒక్కరికి నిజమే అనిపిస్తుంది. అలాగే అతడు చేసిన వ్యాఖ్యలు వింటే కూడా జనసేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తున్నారు అన్న వార్త నిజమేనేమో అన్న అనుమానం రక తప్పదు. ఇటీవల పవన్ నేను ఎదురుపడితే వైసీపీ నేతలు రెండు చేతులూ ఎత్తి నమస్కారం పెట్టాలి. ప్రధాని మోదీ వద్దకు వెళ్లి, చంద్రబాబు దగ్గర కూర్చుని 2014లోలాగా కలిసి పోటీ చేద్దామని నేను నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు మాట్లాడుతున్న నాయకులంతా ఏ స్థాయిలో ఉండేవారో అని మాట్లాడడం బీజేపీ తో తన అనుభవాలను కూడా చెప్పడం చూస్తే వచ్చే ఎన్నికలకు పవన్ బీజేపీ తో కలిసి పోటీచేయడం కానీ తన పార్టీ ని బీజేపీ లో కలపడం కానీ చేయవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు చూడాలి ఏంజరుగుతుందో.   

మరింత సమాచారం తెలుసుకోండి: