ఈ మధ్యకాలం తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్నటి మొన్న సీనియర్ రంగస్థలం, సినీ నటులు శివప్రసాద్ మరణించి తీరని విషాదం చోటు చేసుకుంది. ఆ మరణవార్త నుంచి కోలుకులోపే ఇటీవల ఓ నిర్మాత రోడ్డు ప్రమాదంలో తనువూ చలించి తెలుగు ఇండస్ట్రీకి పెద్ద షాక్ గురిచేశారు. 

                                   

ఇప్పుడు తాజాగా శ్రీనాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ అధినేత ఆలపాటి రంగారావు నిన్న బుధువారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అయన ఇంట్లోనే ఉంటూ వైద్యుడి చేత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే గత రాత్రి పరిస్థితి విషమించడంతో  కన్నుమూశారు. 

                                 

88 సంవత్సరాల వయసులో రంగారావు కన్నుమూశారు. అయితే అయన న్యాయనికి శిక్ష, కాయ్ రాజా కాయ్, చిన్నారి స్నేహం, రాజకుమార్, నాకు పెళ్లాం కావాలి, దోస్తి దుష్మన్(హింది) వంటి చిత్రాలను నిర్మించారు. అంతేకాదు కాన్‌ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా రంగారావు స్థాపించారు. 

                               

70వ దశకంలో ఆయన అగ్ర నిర్మాతగా పేరుగాంచారు. కాగా ఈ నిర్మాతకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో పలువురు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆలపాటి రంగారావు ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం రంగారావు మృతి వార్త విని టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: