శంషాబాద్ పరిసరాల్లో దారుణ హత్యాచారానికి గురైన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారం ఈరోజుకి జరిగిన దిశా ఘటనపై టీనేజ్ పిల్లల నుండి పండు ముసలి వరుకు ప్రతి ఒక్కరు కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. సినీ నటుల నుండి రాజీకియ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే ఈ కేసుకు సంబంధించి నిందితుల నుండి రోజుకో నిజం బయటపడుతుంది. ఆ నలుగురు కామాంధులును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు (నిన్న) గురువారం విచారించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మొదటి రోజే సిట్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్ టీమ్ తనిఖీలు చేసింది. 

 

ఈ తనిఖీల్లో దిశ తల వెంట్రుకలను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. నిందితులకు సంబంధించి లారీ క్యాబిన్‌లోనూ కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. అయితే ఆ సమయంలోనే తుండుపల్లి టోల్‌గేట్ సమీపంలో దిశ సెల్ ఫోన్ ను పాతిపెట్టినట్టు నిందితులు చెప్పారు. దీంతో టోల్‌గేట్‌ వద్దకు వెళ్లిన క్లూస్ టీం ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకుంది. 

 

అయితే ఆ ఫోన్ లో కీలక ఆధారాలు, ఫోటోలు ఉన్నాయి అని దిశ వేలి ముద్రలు, నిందితుల వేలిముద్రలు ఉన్నాయని సమాచారం. మరోవైపు.. దిశ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు విచారణను వేగవంతం చేశారు. దిశ హత్య కేసులో మొత్తం ఏడు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 

 

అయితే రెండొవరోజు మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది అని పోలీసులు చెప్తున్నారు. కాగా ఈ దిశా ఘటనతో ఎంతోమంది అమ్మాయిలు, మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయపడిపోతున్నారు. అంత అరాచకంగా ప్రతి అర్థగంటకు ఒకచోట అత్యాచారాలు జరుగుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: