దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ హ‌త్య‌కేసులో న‌లుగురు నిందితులు  ఈ రోజు తెల్ల‌వారుజామున ఎన్‌కౌంట‌ర్‌కి గురైన సంగ‌తి తెలిసిందే. నిందితులు ఆరిఫ్‌, శివ‌, న‌వీన్, చెన్న‌కేశవులుపోలీసుల నుండి త‌ప్పించుకునే క్ర‌మంలో వారిపై ఎన్‌కౌంట‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. మ‌రి కొద్ది సేప‌ట్లో దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. అయితే నిందితుల‌ని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల విభిన్న స్పంద‌న‌లు వ‌స్తున్నారు. అయితే, పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.  నిందితుల‌కి తగిన శిక్ష ప‌డిందని స్ప‌ష్టం చేస్తున్నారు. చ‌ట్టం, విచార‌ణ‌, ద‌ర్యాప్తు అంటూ సాగ‌దీత చేయ‌కుండా త‌క్ష‌ణ‌మే తీర్పు వెలువ‌డింద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

 


`రేపిస్టులను కొట్టి చంపాలి..బహిరంగంగా ఉరితీయాలి..సానుభూతి కాదు.. సత్వర న్యాయం కావాలి..నేరం చేయాలంటే .. వణికేలా చట్టాలు తేవాలి`. ఇవి సామాన్యు లు చేసిన డిమాండ్లు కావు. పార్లమెంట్ సభ్యులు చేసిన డిమాండ్లు. వెటర్నరీ డాక్టర్​ ‘దిశ’ అత్యాచారం, హత్య వారిని కదిలించింది. పార్లమెంట్ వేదికగా,పార్టీలకు అతీతంగా సభ్యులంతా సోమవారం గళమెత్తారు. దారుణాన్ని ఏకకంఠంతో ఖండించారు. ఆ రేపిస్టులను వెంటనే ఉరితీస్తే మరో సంఘటన జరగకుండా ఉంటుందని అన్నారు. ఇప్పుడున్న చట్టాలు సరిపోవని, వాటిని మార్చాల్సిందేనని పట్టుబట్టారు. దేశం తలదించుకునే ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్నాళ్లని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళా ఎంపీలు కన్నీళ్లు పెట్టుకు న్నారు. ‘నిర్భయ’ కేసులో దోషులకు ఇప్పటికీ శిక్ష అమలు కాలేదని, దిశ కేసులోనూ అలాంటి పరిస్థితి రావొద్దన్నారు. సభ్యుల సూచనలను ఆహ్వానిస్తున్నామని, చట్టాల్లో సవరణలకు సిద్ధమని కేంద్రంప్రకటించింది. 

 

ఇలా ప్ర‌జ‌లు, వారు ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాలలో మార్పు కోసం నిన‌దించారు. సాక్షాత్తు పార్ల‌మెంటు వేదిక‌గా దేశం దిశ‌ను నిర్దేశించే ప్ర‌జాప్ర‌తినిధులు సైతం చ‌ట్టంలో మార్పును తీసుకువ‌చ్చేందుకు ప‌ట్టుబ‌ట్టారు. వెటర్నరీ డాక్టర్​పై జరిగిన దారుణాన్ని తలచుకుంటే ఎంతో బాధకలుగుతోందని లోక్​సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు చురుగ్గా పనిచేయాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దిశ ఘ‌ట‌న‌తో అయినా... ప్రజల కోసమే చట్టాలు అనే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: