గత పదిరోజులుగా దిశ హత్యాచార ఉదంతంతో దేశం అట్టుడికిపోతుంది. నిందితులను ఊరికే వదలకూడదని ప్రజలు ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ రోజు జరిగన నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి కలిగి ఉంటుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిశ తల్లిదండ్రులు సైతం తమ కూతురు ఎలాగో తిరిగి రాలేదు. కనీసం ఆ నిందితులకు పడ్డ శిక్షతో మాకు కొంత వరకు న్యాయం జరగిందని అంటున్నారు. కాని నిందితుల తల్లిదండ్రులు మాత్రం ఎన్ కౌంటర్ లో పోలీసులు కావాలనే మా కొడుకులను చంపేసారని  ఆరోపిస్తున్నారు.


ఈరోజు తెల్లవారుజామున 3న్నర గంటల సమయంలో దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్‍కౌంటర్ చేశారు. నిందితులు పోలీసుల తుపాకులు లాక్కొనిపారిపోవడానికి ప్రత్నంచిగా వాళ్ళను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తుపాకీలను లాక్కోవడమే కాకుండా కొంత దూరం పారిపోయి పోలసులపై రాళ్లదాడి చేసారని .. ఇది సహించలేని పోలీసులు ఎన్ కౌంటర్ చేసారని అంటున్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు చనిపోయారని తెలిసింది.


కాని నిందితుల తల్లిదండ్రులు మాత్రం పోలీసులు అబద్ధం చెబుతున్నారనీ, కావాలనే నిందితులు నలుగురినీ చంపేసి, ఎన్‌కౌంటర్ జరిగిందని అంటున్నారని ఆరోపిస్తున్నారు. తమ కొడుకుల్ని అన్యాయంగా చంపేశారని నిందితుడు అరిఫ్ తల్లి, మరో నిందితుడు చెన్నకేశవులు తల్లి కన్నీరు పెడుతున్నారు. ఇలా పోలసులే శిక్షలు విధిస్తే ..ఇంకా కోర్టులు చట్టాలు ఉన్నదెందుకు అని ఆరోపిస్తున్నారు. 


తమ పిల్లల్లి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇలా అనడం లేదని.. వాళ్లు చేసిన పనికి తప్పక శిక్షపడాల్సిందేనని అయితే దానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయని అంటున్నారు. ఇలా ఎన్ కౌంటర్ చేసుకుంటూపోతే ఇక కోర్టులు ఉన్నదేందుకు అని ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా తమ కొడుకలను చంపేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: