దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ పోలీసులపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డలు అంత మమ్మల్ని రక్షించేందుకు.. నీచులైన నింధితులను శిక్షించేందుకు మానవరూపంలో ఓ దేవుడుల వచ్చాడు అని సీపీ సజ్జనార్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

      

ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ ఫోటోలకు పాలాభిషేకం చేస్తున్నారు ప్రజలు. మా ఆడపిల్లలను దైర్యంగా బయటకు పంపడానికి మాకు ధైర్యాన్ని ఇచ్చావ్ అయ్యా అంటూ పాలాభిషేకం చేస్తూ జయహో హైదేరాబద్ పోలీస్ అంటూ జయహోలు పలుకుతున్నారు. సోషల్ మీడియాలో సైతం సీపీ సజ్జనార్ పై దేశవ్యాప్తంగా వార్తలు హర్షం వ్యక్తం అవుతుంది. 

       

అందరూ కూడా తెలంగాణ పోలీస్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో సజ్జనార్ 2008 లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ దిశ హత్యకేసులో అదే సీన్ రిపీట్ అయ్యిందని హర్షవ్యక్తం చేస్తున్నారు. రెండు ఘటనల్లోనూ సజ్జనార్ కీలక బాధ్యతల్లో ఉన్నారని అప్పుడు వరంగల్ ఎస్పీగా ఇప్పుడు సైబరాబాద్ సీపీగా ఆయనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. 

          

వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కూడా చూసుకోకుండా అతి కిరాతకంగా కిరోసిన్ పోసి ఆ నిందితులు కాల్చేశారు. అయితే అదే ఘటనను పోలీసులు రికర్రెక్షన్ చేస్తుండగా ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ నిందితులైన ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులుపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో కోపంతో రగిలిపోతున్న దేశం అంత ఒక్కసారిగా చల్లబడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: