జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత రెండు మూడు రోజులుగా దిశ నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అని వివాదానికి గురై ఆ వార్తల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో ఈసారి ఓ మంచి పని చేసి వార్తల్లో నిలిచాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే నేడు 'ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే' సందర్భంగా రూ.కోటి విరాళం ప్రకటించారు. 

 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. నేడు 'ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే' కావడంతో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సైనిక కుటుంబాలకు సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందచేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ వేధికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ ప్రకటించాడు. 

 

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ట్విట్ చేస్తూ... ''మన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం 'కేంద్రీయ సైనిక్ బోర్డు'కు కోటి రూపాయల విరాళం ఇస్తానని.. ఢిల్లీలోని సంబంధిత అధికారులను వ్యక్తిగతంగా కలిసి ఈ మొత్తానికి సంబంధించిన డీడీనీ అందజేయనున్నట్టు పవన్ పేర్కొన్నారు. ఇక, దేశం పట్ల మన బాధ్యతను గుర్తు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ ట్విట్ కి #ArmedForcesFlagDay అనే యాష్‌ట్యాగ్ ను కూడా జతచేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: