దేశంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరిగాయి... హత్యలు జరిగాయి అంటూ రోజుకో వార్త తెరమీదకి  వస్తూనే ఉంది. కఠినంగా శిక్షించడానికి ఎన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ కూడా కామాంధులు అకృత్యాల్లో  ఎలాంటి మార్పు రావడంలేదు. విచ్చలవిడిగా ఆడది కనిపిస్తే చాలు మీద పడిపోయి అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేసేస్తున్నారు . నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడంలేదు కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసులు లాంటి మృగాళ్లు . దీంతో ఆడపిల్లలు  ప్రశ్నార్థక జీవితాన్నే  గడుపుతున్నారు . కనీసం కాలు బయట పెట్టాలంటేనే  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడది అర్ధరాత్రి నిర్భయంగా రోడ్డుమీద తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్టన్నారు గాంధీజీ.... కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అర్ధరాత్రి కాదు కదా... పట్టపగలు రోడ్డు మీదుకు వెళ్లిన కామపు కోరల్లో చిక్కుకుని పిల్ల అంతం అయిపోతుంది . 

 

 

 

 గతంలో నిర్భయ ఘటన తాజాగా దిశా ఘటన . ఇలా వరుసగా అత్యాచారాలు హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు కామాంధులు . కనీసం ప్రస్తుతం ఆడపిల్లలకు తన సొంత ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. చదువు కోవటానికి  వెళ్తే గురువుల నుంచి... రోడ్డుపైన వెళ్తుంటే ఆకతాయిల నుంచి... ఇక ఇంట్లో కి వెళ్తే సొంత  వాళ్ల నుంచి ఆడపిల్లలకు రక్షణ కరువైంది. దేశంలో ఎక్కడో ఒక చోట ఆచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలు చేయడం... ఆపై అతికిరాతకంగా చంపేయడం ఇలాంటి ఘటనలు ప్రస్తుతం రోజుకు ఒకటి తెర మీదకు వస్తున్నాయి. అయితే మన దేశంలో 2007వ సంవత్సరంలోనే 32,500 రేప్ కేసులు నమోదయ్యాయి. కరెక్టుగా చెప్పాలంటే దేశంలో రోజుకు 90 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు అన్నమాట. అయితే ఇది కేవలం అధికారిక గణాంకాలు మాత్రమే. అత్యాచారాలు జరిగినప్పటికీ పరువు పోతుందని తమలో తాము కుమిలిపోయి  కేసు నమోదు చేయకుండా ఉన్న బాధితులు కూడా ఎంతోమంది. 

 

 

 

 కాగా 2007 సంవత్సరంలో కేసులో కోర్టు తీర్పు వెలువరించిన కేసులు కేవలం 18, 300 మాత్రమే. 2017 సంవత్సరం చివరినాటికి 1,27,800 రేప్ కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి . ఇక 2010 సంవత్సరంలో 22, 172 రేప్  కేసులు నమోదయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి . అయితే తాజాగా విశాఖ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అమాయకపు ఆడపిల్లలపై కామ వాంఛతో  రాక్షసుల్లా  మీద పడి అత్యాచారాలు హత్యలు చేసిన నిందితులకు ఇలాంటి ఎన్కౌంటర్లే  సరైన శిక్ష అంటూ దేశ ప్రజానీకం నినదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: