దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు పోలీసులు. దేశ వ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుకు ఎన్‌కౌంటర్ ద్వారా ముగింపు పలికారు. కానీ పోలీసులకు మరొక సమస్య వచ్చి పడింది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఎన్‌కౌంటర్‌ ను సుమోటా గా తీసుకుని విచారిస్తోంది, ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అని ఎన్‌హెచ్‌ఆర్సీ భావిస్తోంది. ఇంకా చాలా మంది చాలా విధాలుగా ఇది నకిలీ ఎన్‌కౌంటర్‌ అంటూ ఏవేవో చెప్తున్నారు.

 

తాజాగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక లో వచ్చిన ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇంతకీ ఆ వార్త సారాంశం ఏంటంటే దిశ హత్యాచారం వెనుక ఒక పెద్ద స్కాం. చంద్రసిద్దార్థ అనే దర్శకుడు ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

దిశ హత్యాచారం వెనుక ఒక పెద్ద స్కాం ఉంది. ఆమె పని చేసే పశుసంవర్ధక శాఖ లో ఒక స్కాం ఆమె దృష్టికి వచ్చింది, దీనితో ఆమె ఈ స్కాం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పరిశోధన మొదలుపెట్టింది. ఈ స్కాం వెనుక ప్రముఖుల హస్తం ఉండడంతో, నిరూపించడానికి సాక్ష్యాధారాలు సేకరించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో దిశ గచ్చిబౌలి వెళ్లిన సంగతి తెలుసుకున్న ఆ ప్రముఖులు, స్కాం విషయం బయటపడితే తమ పరువు పోతుందని భావించిన వారు దిశ ను చంపాలని చూసారు. అప్పటికప్పుడు కిరాయి రౌడీలు ఎవ్వరూ దొరకక పోవడంతో తొండుపల్లి వద్ద లారీ డ్రైవర్లని గమనించి వారికి డబ్బు ఆశ చూపించి దిశ ను హత్య చేయించాలనుకున్నారు. మద్యం తాగిన లారీ డ్రైవర్లు దిశ ని అత్యాచారం చేసి హత్య చేశారు. సరిగ్గా ఇదే అర్ధం వచ్చేలా ఒక రెండూ లైన్లలో చంద్రసిద్దార్ధ ఆ దినపత్రికలో చెప్పారు.

 

నిందితుల ఎన్‌కౌంటర్‌ పై రోజుకొకరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. చంద్రసిద్దార్థ ఇంకో అడుగు ముందుకేసి ఈ హత్య వెనుక ప్రముఖుల హస్తం ఉంది, వాళ్ళ పేర్లు బయటకు పెడతారనే భయంతో ఎన్‌కౌంటర్‌ చేయించారు అని కొందరు చెప్తున్నారు అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: