కర్ణాటకలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే బలనిరూపణకు చేసుకోకపోవడంతో ఎడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ బీజేపీ మాత్రం కర్ణాటక లో ప్రభుత్వం ఏర్పాటు పై పట్టు వదలలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ జేడీఎస్  ఎమ్మెల్యేలను ఆకర్షించి తమ వైపు తిప్పుకుంది.దీంతో కర్ణాటకలో మరోసారి బలనిరూపణ త్వరగా జెడిఎస్ కాంగ్రెస్లో బలనిరూపణకు చేసుకోలేక పోవడంతో జిడిఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి.

 

 

 

 మరోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీకి మద్దతు తెలిపిన మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు వెంటనే స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో కర్ణాటకలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 5న 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా నేడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా  ఉప ఎన్నికల ఫలితాలపై కర్ణాటక ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉప ఎన్నికల్లో మొత్తం 66.25 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఉప ఎన్నికల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజారిటీ ఉంటుంది. లేదంటే ఎడ్యూరప్ప సర్కార్ కుప్పకూలిపోతుంది . 

 

 

 

 ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు జెడిఎస్ పార్టీకి 34 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా .. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. స్పీకర్ తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు... రాజీనామాలు చేయడం... అటు వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంతో జిడిఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉప ఎన్నికల ఫలితాలు బిజెపి భవితవ్యాన్ని తేల్చనున్నాయి. చూడాలి మరి ఈ ఉప ఎన్నికల్లో ఎవరు మెజార్టీనీ సొంతం చేసుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: