ఇటీవల కొద్దికాలంగా విశాఖపట్నం అడ్డాగా వ్యభిచార ముఠాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. కొన్నాళ్ల క్రితం అక్కడి బీచ్ రోడ్ లోని పలు హోటళ్ల పై దాడి చేసిన పోలీసులు కొందరు వ్యభిచారం చేసే వారిని అరెస్ట్ చేసి పట్టుకున్న ఘటన మరువక ముందే, నేడు సరిగ్గా అదే ప్రాంతంలోని ఒక ప్రముఖ హోటల్ లో కొందరు వ్యక్తులు అక్రమంగా అమ్మాయిలను వేరే ప్రాంతాల నుండి తరలరించడంతో పాటు ఆన్ లైన్ మాధ్యమాలు వేదికగా చేసుకుని విటులను ఆకర్షించి అక్కడ వ్యభిచారం నిర్వహిస్తుదగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

 

వాస్తవానికి గతంలో మాదిరిగా బీచ్ రోడ్ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం వస్తోందని, అయితే ముందే రైడింగ్ కి దిగితే వారు జాగ్రత్త పెడతారనే ఉద్దేశ్యంతోనే, అదును చూసి కాపు గాసి పట్టుకుని వారి గుట్టు బయటకు లాగమని అంటున్నారు స్థానిక పోలీసులు. ఇక ఈ అరెస్ట్ సమయంలో కొందరు విటులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి అరెస్ట్ అనంతరం పోలీసులు మాట్లాడుతూ, ఇటీవల ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తరించడంతో పాటు సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువ అవడంతో, 

 

కొందరు వ్యక్తులు వాటిని మార్గాలుగా చేసుకుని అమ్మాయిల పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసి, యువకులను ఆకర్షించడం, ఆపై వారి బిజినెస్ కార్యకలాపాలను యువకులకు వివరించి ఒప్పందాలు చేసుకోవడం వంటివి చేస్తున్నారని అన్నారు. కాగా ఇందుకోసం మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా ముంబై వంటి ఇతర ప్రాంతాల నుండి కూడా అమ్మాయిలను రప్పిస్తున్నారని, అయితే ఇటువంటివి ఏదైనా ఇళ్ల వద్ద నిర్వహిస్తే అక్కడి స్థానికులకు అనుమానం వస్తుందని భావించి, కొన్ని పెద్ద పెద్ద హోటళ్లను అడ్డాలుగా చేసుకుంటున్నారని అన్నారు. ఇక నేడు అరెస్ట్ చేసిన వారిని రిమాండ్ కు తరలించామని, వారిపై కేసు నమోదు చేసి రేపు కోర్ట్ కు హాజరు పరుచనున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: