ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన ఫస్ట్ రోజు నుంచే వేడి పుట్టిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీ... జగన్ ఆరు నెలల పాలనా వైఫల్యాలపై ప్రశ్నించినుంది. అయితే అధికార పార్టీ వైసీపీ కూడా టిడిపి పార్టీకి దీటైన సమాధానాలని ఇవ్వడానికి సిద్ధమైంది. తొలిరోజే పీపీఏల విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం నెలకొంది.  విద్యుత్ రంగంలో గోపాలరెడ్డి ఇచ్చిన నివేదికలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అంటూ టిడిపి ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు... ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చినా... టిడిపి నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇతర వైసిపి సభ్యులు మాట్లాడుతుంటే... టీడీపీ నేతలు వారిని ఆపేందుకు అడ్డుకున్నారు.



దీంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి  మాట్లాడుతూ... ' శాసనసభ సభ్యులు ఎవరైనా మధ్యలో మాట్లాడుతుంటారు... అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇలా జరుగుతూ ఉంటే అరాచక శక్తులు అని గౌరవ సభ్యులను పట్టుకొని... సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం గౌరవప్రదం కాదు అధ్యక్షా.. అని అనడంతో... టిడిపి నేతలు అందరూ లేచి... వైసీపీ నేతలు కూర్చునే సీటు వద్దకు వచ్చారు. దాంతో ఆనం రాంనారాయణ రెడ్డి... దయచేసి నా సీటు మార్చండి సార్... అంటుంటే... చంద్రబాబు నాయుడు మధ్యలో జోక్యం చేసుకొని మీరు మా మాట కూడా వినాలి స్పీకర్ గారు అంటూ సీతారాం తో వాదనకు దిగాడు. 


ఆ తర్వాత.. ప్రతిపక్ష నేతే నా పక్కన వచ్చి నిలబడితే నేనేం మాట్లాడగలను సార్.. మీరు గమనించండని రామ్ నారాయణ రెడ్డి అనేసరికి ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసీపీ నేతలు నవ్వారు. రామ్ నారాయణ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత నా పక్కన వచ్చి నిలబడితే నాకు మాట్లాడగలిగే ధైర్యం ఉంటుందా సార్ ప్రశ్నించారు. మమ్మల్ని కూడా మాట్లాడినివ్వండి సార్ అంటూ చంద్రబాబు ఆవేశంతో ప్రశ్నించడంతో... జగన్మోహన్ రెడ్డి నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడ్డారు.

ఆ తర్వాత ఆనం మాట్లాడుతూ.. దయచేసి అరాచక శక్తిలు అనే పదాన్ని టిడిపి నేతలు ఉపసంహరించుకోవాలని.. మేము కోరుతున్నాం, లేకపోతే... మీ రికార్డ్స్ నుంచి తొలగించాలి అంటూ స్పీకర్ ని కోరారు. దీంతో స్పీకర్ అరాచక శక్తులు అన్న పదాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: