ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి  నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగింది. అసెంబ్లీ సమావేశాలు వైసీపీ ఎమ్మెల్యేలు వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లో పలు  కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా తాజాగా నేటి అసెంబ్లీ సమావేశం పై టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భారీగా పెరిగిన ఉల్లి ధరలపై చంద్రబాబు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.అటు  టిడిపి నేతలు కూడా మెడలో ఉల్లిపాయలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. 

 


 కాగా  అసెంబ్లీ సమావేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొని అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కనీసం అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వలేదని.. తమ విజువల్స్ కూడా ప్రసారం చేయక పోవడంతో అసెంబ్లీలో తాము ఉన్నామా లేదా అన్న విషయం కూడా బయట వాళ్లకు తెలియకుండా చేసే ప్రయత్నాలు వైసీపీ నేతలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసెంబ్లీలో వైసీపీ తీరు పై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. ఇంత నీచమైన దారుణమైన రాజకీయాలు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆయన విమర్శించారు. 

 


 ప్రతిపక్ష నేత తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని... సభ సాంప్రదాయాలను కాపాడాలి అంటూ చెబుతున్న స్పీకర్ తమ్మినేని వీరభద్రం సభా సంప్రదాయాలను ఉల్లంఘించడం దారుణమైన విషయం అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వలేదు కాబట్టే  ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమపై  చేసిన విమర్శలకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్యంలో సాంప్రదాయమైనదన్న  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు... తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ వన్ సైడ్ వెళ్లిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: