శ్రీరాముడు అంతటివాడే తన భార్య సీతను ఎత్తుకుపోయిన రావణాసురుడిని సంహరించి ఆమెను తెచ్చుకోలేదా? మనలాగే చట్ట ప్రకారం వెళ్లి... దేవదేవులను ఆశ్రయించి రావణుడిపై కిడ్నాప్ కేసు పెట్టినట్లయితే.. రావణుడు చచ్చేవాడ? నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేసి పైశాచిక ఆనందం పొందిన కౌరవులని చంపకుండా రేప్ అట్టెంప్ట్ కేసు పెడితే.. లోక కల్యాణం జరిగి ఉండేదా..? దేవుళ్ళే కేసులు, విచారణలు లేకుండా తప్పు చేసిన వారిని డైరెక్ట్ గా చంపేశారు. మరి మన మనుషులు ఎందుకు దుష్ట చతుష్టయానికి సానుకూలమైన చట్టాలను రాసుకొని దేవుళ్లు పాటించిన రాతియుగ శిక్షలను వదిలేసారు?



ఇదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే.. కౌరవుల కంటే ఘోరమైన దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే... మేధావులుగా చెప్పుకొనే కొంతమంది బుద్ధిహీనులు వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారం ఎందుకు చంపలేదంటూ దోషుల వైపు మాట్లాడుతూ... ఈ కౌరవ సంతతి కన్నీరు కారుస్తున్నారు. నిజానికి..  ఫస్ట్, ఇలాగా        మాట్లాడేవారిని.. సజ్జనార్ సీన్ రీ కన్ స్ట్రక్షన్ తీసుకెళ్లి.. ఎన్ కౌంటర్ చేస్తే కానీ మన దేశం బాగుపడదు.

 


ఇకపోతే, దిశ హత్య కేసు నిందుతుల ఎన్ కౌంటర్ తర్వాత... మిగత నేరస్తులను కూడా అదే తరహాలో ఎన్ కౌంటర్ చేయాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో గతంలో హత్యలు, అత్యాచారాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రస్తుతం అలాంటి నేరస్థులల్లో ఒకరు.. పోలీసులు ఎక్కడ కాల్చి చంపుతారో అనే భయంతో ముత్యంపేట గ్రామ శివారులో మర్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


వివరాల్లోకి వెళితే... వృత్తిపరంగా ఆటో డ్రైవర్ అయిన లక్మిరాజ్యం(40) తన భార్య విమల(37)ను గత కొంత కాలంగా కట్నం తీసుకురమ్మని వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తాళలేక విమల ఖమ్మంపల్లిలోని తన పుట్టింటికి పిల్లలుతో సహా వెళ్ళింది. అయితే గత నెల 22న లక్ష్మీరాజ్యం అత్తగారింటికి వెళ్లి... పెళ్ళాం, పిల్లలతో సహా వదిన, బావమరిది, మరదులపై టిన్నర్ అనే రస ద్రావణం పోసి, ఆపై నిప్పటించి నలుగురి చావుకు కారణమయ్యాడు. ఆరోజు నుంచి లక్షిరాజ్యం పరారీలో ఉన్నాడు. అయితే.. అతని కోసం 12 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇది తెలుసుకున్న నిందితుడు లక్షిరాజ్యం... తాను తప్పించుకోవడం అసాధ్యమని భావించి.. దొరికితే పోలీసులు ఖచ్చితంగా దిశ నిందితులను చేసినట్లు ఎన్ కౌంటర్ చేస్తారని.. భయపడి ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నాడు. దీంతో దిశ నిందితుల ఎన్కౌంటర్ వలన.. పోలీసుల చేతికి మట్టంటకుండా.. ఓ కిరాతక నేరస్తుడు తనకి తానే శిక్షను విధించుకున్నాడు. ఒక్క ఎన్ కౌంటరే దోషుల మీద ఇంత ప్రభావం చూపించిందంటే.. ముప్పొద్దులా జైల్లో మేస్తున్న నిందితులను కూడా రోజువారీగా హతం చేస్తే భవిష్యత్తులో నేరస్తులే ఉండరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: