షాద్నగర్లో వైద్యురాలు దీక్షపై నలుగురు నిందితులు పథకం ప్రకారం అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన  విషయం తెలిసినదే. నిందితులకు  వెంటనే ఉరిశిక్ష విధించాలని అంటూ దేశ ప్రజానీకం డిమాండ్ చేసింది. అయితే నిందితులకు శిక్ష విధించడంలో ఆలస్యం జరుగుతున్న దానిపై అసహనం వ్యక్తం చేసినది  దేశ ప్రజానీకం. నిందితుల్ని మాకు అప్పగించండి మేమే చంపేస్తామంటూ నిరసనలు కూడా తెలిపారు . ఈ నేపథ్యంలో ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసును రికన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు  తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేయక తప్పలేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఎన్కౌంటర్పై వివరణ కూడా ఇచ్చారు. 

 

 

 

 అయితే దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్ ప్రస్తుతం సంచలనంగా మారిందనే  చెప్పాలి. విశాఖ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఓవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపడుతుంటే మరోవైపు ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా విచారణ చేపట్టేందుకు సిట్ ను నియమించింది. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ చేసిన పోలీసు చిక్కుల్లో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. నిందితుల పోస్టుమార్టం సహా దిశ తల్లిదండ్రుల స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. హైకోర్టులో కూడా దీనిపై  విచారణ జరుగుతుంది. 

 

 

 

 ఇదిలా ఉండగా కేసు మరో కొత్త మలుపు తిరిగింది. పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని కొత్త అంశం తెరమీదకు వచ్చి  సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్ కి 26ఏళ్ళు  ఉండగా... మిగతా నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులుకు 20 ఏళ్ళు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నిందితుల తల్లిదండ్రులను విచారించగా సరికొత్త విషయం తెరమీదికి వచ్చింది. దిశా  కేసులోని నలుగురు నిందితులు ఇద్దరు నిందితుల తల్లిదండ్రులు తమ కొడుకులు మైనర్లని  కూడా చూడకుండా ఎన్కౌంటర్ చేశారు అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు మృతుల ఆధార్ కార్డు, సర్టిఫికెట్ వివరాలను పరిశీలించగా... తేదీలు వేరువేరుగా ఉండడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: