అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు పరువు పోగొట్టుకున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తరచూ చెప్పుకునే చంద్రబాబు చాలా చవకబారుగా వ్యవహరిస్తుండటంతోనే సమస్యలు వస్తున్నాయి. ఉల్లిపాయల ధరలపై మాట్లాడుతూ ఉల్లిపాయలు కొనటానికి వెళ్ళి సోమవారం రైతుబజార్లో ఓ వ్యక్తి మరణించాడంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

 

ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్ తమ ట్విట్టర్ ఖాతాలో కూడా ప్రముఖంగా పోస్టులు పెట్టారు. అయితే వాళ్ళకు ఊహించని రీతిలో షాక్ తగిలింది. మంగళవారం ఉదయం చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు మాట్లాడుతూ తమ తండ్రి చనిపోవటానికి ఉల్లిపాయలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

తమ తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు వాళ్ళు చెప్పారు. 25 రూపాయలకు దొరుకుతున్న ఉల్లిపాయల కోసం తమ తండ్రి రైతుబజార్లో క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. ఉల్లిపాయల కోసమే తన తండ్రి క్యూలో నిలబడి చనిపోయినట్లు మీడియాలో చెబితే తమకు రూ. 25 లక్షల నష్టపరిహారం ఇప్పిస్తామని ఎల్లోమీడియా, టిడిపి నేతలు తమతో చెప్పినా తాము పట్టించుకోలేదన్నారు.

 

అయితే తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి  రైతుబజారుకు వెళ్ళలేదా  ? ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడినపుడే కదా చనిపోయింది ? అంటూ మళ్ళీ రెట్టించిన స్వరంతో ఊగిపోయారు. అయితే కుటుంబసభ్యులు మాట్లాడిన వీడియోలో తమ తండ్రి కేవలం కూరగాయల కోసమే మార్కెట్ కు వెళ్ళాడు కానీ ఉల్లిపాయల కోసం కాదని చెప్పారు. అయినా చంద్రబాబు ఒప్పుకోలేదు. అయితే మళ్ళీ ఆ విషయాన్ని ఎత్తలేదు.

 

రాజకీయాల్లోకి తమ తండ్రి మరణాన్ని లాగితే ఊరుకునేది లేదంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన వార్నింగ్  చూసిన తర్వాత చంద్రబాబు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. కూడా ఇచ్చారు. వాళ్ళు మాట్లాడిన విషయాలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కొడాలి నాని వీడియో వేసి చూపించటంతో చంద్రబాబుతో పాటు టిడిపి సభ్యుల నోళ్ళు పడిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: