దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పురుడు పోసిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ జగన్ పార్టీని, పార్టీ నేతలను ముందుండి నడిపించారు. ఇక ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైసీపీలోకి చాలామంది ఇతర పార్టీల నేతలు ఎన్నికల ముందు వచ్చారు. ఇతర పార్టీలో కీలక నేతలు అయినప్పటికీ జగన్ మీద నమ్మకంతో వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అందరికీ జగన్ ఒక్కరే బాస్. 

 

 

 

 ఇక పార్టీ నేతలందరూ తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేమగా జగనన్న అని పిలుచుకుంటారు. తన పార్టీలోని ఎక్కువమంది జగన్ ను  జగనన్న అని పిలుస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి జగనన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏపీ మంత్రి కొడాలి నాని తాను జగన్ ను ఏ విధంగా పిలుస్తాను అన్న విషయాన్ని వెల్లడించారు. ఆయన కూడా అందరిలాగానే జగనన్న అని పిలుస్తానని... కానీ ఒక్క పేరుతోనే కాకుండా జగన్ గారిని సార్ అని అంటూ ఉంటా అని.. కొన్నిసార్లు బాస్ అని కూడా పిలుస్తూ ఉంటాను అని  అంటూ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. 

 

 

 

 ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కొడాలి నాని ప్రతిపక్ష నేతల పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కొడాలి నాని. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు కొడాలి నాని వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాల పై విరుచుకుపడుతున్నారు మంత్రి కొడాలి నాని. తనదైన స్టైల్లో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: