నరేంద్రమోడి అంటేనే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వణికిపోతున్నట్లున్నారు. కొద్ది రోజులుగా  వారిద్దరి వైఖరి చూస్తుంటే జనాలకు కూడా ఇలాంటి అనుమానాలే పెరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఉల్లిపాయ ధరలు పెరిగిపోతుండంపై చంద్రబాబు, పవన్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ గా చేసుకున్నారు. ఇక పప్పునాయుడు అంటే చంద్రబాబు పుత్రరత్నం అయితే ట్విట్టర్లో ఉల్లిపాయ ధరలు, జనాలు క్యూలో నిల్చోవటం లాంటి ఫొటోలను పోస్టు చేస్తు బిజీగా ఉంటున్నారు.

 

నిజానికి ఉల్లి ధరలు పెరగటమన్నది జగన్ చేతిలో లేదు. ఎందుకంటే ఉల్లిపాయలను మనరాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు. ఆ మధ్య కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల చాలా వరకూ ఉల్లిపాయ పంటలు దెబ్బతిన్నాయి. దాంతో ఉల్లిధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

దేశవ్యాప్తంగా ఉల్లిధరలు పెరిగిపోయినా రాష్ట్రంలో మాత్రం ఉల్లిపాయలను కేజికి 25 రూపాయలకే అందిస్తోంది జగన్ ప్రభుత్వం. బయట రాష్ట్రాల్లో కొనాలన్నా ఉల్లిపాయలు దొరకని కారణంగా కేజి ఉల్లిపాయలు బహిరంగ మార్కెట్ లో రూ. 200 ఉంది. అంటే ఉల్లిధరలు పెరిగిపోవటంలో జగన్ కన్నా మోడి బాధ్యతే ఎక్కువ. ఉల్లిపాయలను ఈజిప్టు, ఇండోనేషియా ల నుండి తెప్పిస్తున్నామని కేంద్రం చెప్పినా ఇంకా రాలేదు.

 

ఉల్లిధరలకు రెక్కలు రావటంలో వాస్తవాలు ఇలాగుంటే చంద్రబాబు, పవన్ మాత్రం జగన్ నే టార్గెట్ గా పెట్టుకోవటం లో అర్ధమేంటి ? ఏమిటంటే మోడిని నిలదీసే ధైర్యం లేకే అని అర్ధమైపోతోంది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఉల్లిపాయ ధరల పెరుగుదలకు మోడినే కారణమని అంటున్న విషయం కూడా చంద్రబాబు, పవన్ కు కనబడలేదేమో.

 

ఒకవేళ మోడిని గనుక నిలదీస్తే, ఆరోపణలు చేస్తే ఏమవుతుందో అని చంద్రబాబు, పవన్ వణికిపోతున్నట్లు అర్ధమైపోతోంది.  ఇద్దరు కూడా మోడిని ప్రసన్నం చేసుకోవటానికి పడుతున్న పాట్లు అందరూ చూస్తున్నదే. మోడిని ప్రసన్నం చేసుకోవాలంటే సంబంధం లేకపోయినా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయాలన్న టార్గెట్ తో నే ముందుకెళుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: