రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం నిర్ణయంపై ఒక రేంజ్లో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగును  నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు అంటూ విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే అటు అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు మధ్యలో వదిలేసిన  ఇంగ్లీష్ మీడియం ప్రత్యామ్నాయాలను జగన్ ప్రభుత్వం కొనసాగించాలనుకోవడం హర్షించదగ్గ విషయమని రాపాక వర ప్రసాద్ అన్నారు. 

 

 

 

 ప్రభుత్వం ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే వాటిని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని జనసేన కు చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... ప్రతిపక్షనేత స్పీకర్ను గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అంటూ హితవు పలికారు. 

 

 

 ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంటే... జనసేన కు ఉన్న సోలో ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ జగన్  నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో కూడా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎక్కువగా వైసిపి సమావేశాల్లో కూడా దర్శనమిస్తున్నారు రాపాక వరప్రసాద్. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారా అనే చర్చ కూడా మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: