గౌరవనీయులయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  అయిన జగన్ మోహన్ రెడ్డి  గారు గ్రామ సచివాలయం ఏర్పటు చేసి ప్రజలకు మరింత చేరువ అయ్యారు.. ఈ సచివాలయం ఏర్పడడం వల్ల లక్షల మంది నిరుద్యోగ యువత కి ఆధారo దొరికింది.. గ్రామ సచివాలయం ఏర్పాటు గూర్చి బుధవారం అసెంబ్లీ లో చర్చ జరిగింది. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ తెలిపారు.

గ్రామ సచివాలయ ఏర్పాటు వల్ల ప్రజలకి మంచి జరుగుతుందని, గ్రామ స్థాయిలోనే ప్రజలకు సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ సచివాలయం ఏర్పాటు ద్వారా 14 శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ఏప్పుడు ఏ సమస్య వచ్చిన అధికారులకి తెలియచేయవచ్చని తెలిపారు.


అంతేకాకుండా "చంద్రగిరి ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి "మాట్లాడుతూ సచివాలయల ద్వారా ప్రజల వద్దకే పాలన వస్తుందన్నారు. గత ప్రభుత్వం హయాములో గ్రామీణాభివృద్ధి వెనకపడిందని విమర్శించారు. ప్రజలకి చేరువలో  ఉండి ప్రజా సమస్యలని తీరుస్తూ గ్రామ సచివాలయాలు అందరికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటివల్ల "మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యo వస్తుందని తెలిపారు"


సచివాలయాల ద్వారా ప్రజలకి చేరువగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఒక ఆదర్శం అని,గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు
"రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్" గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థ ను నిర్వీర్యం చేసిందని కొనియాడారు...

జగన్ గారు సచివాలయం ద్వారా పంచాయితీ వ్యవస్థ ని మెరుగుపరిచారని, సచివాలయాల ద్వారా 34 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. పేద, ధనిక, కుల, మతాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే సచివాలయాలు ఏర్పాటు పూర్తయిందని,ఉద్యోగుల ఎంపిక కూడా పూర్తిఅయిందని, త్వరలోనే అమలులోకి వస్తాయి అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: