జేసీ దివాకర్ రెడ్డి అనగానే అందరికి గుర్తొచ్చేది దేనికైనా ఒకేలా స్పందిస్తూ ప్రతి విషయాన్నీ అరుస్తూ చెప్తాడు అని అదే జగన్ మోహన్ రెడ్డి  అనగానే మావాడు ఎలాచేసాడు అలా చేసాడు అని విమర్శించే మాజీ టీడీపీ ఎంపీ జేసీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై  ప్రశంసలు కురిపించారు.  ఏంటి...... అని కంగారు పడకండి నిజమే జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాలో మాట్లాడుతూ సీఎం జగన్‌ దైర్యం ఉన్న ఉన్న నాయకుడు అని కితాబిచ్చారు.

ఒక సారి అనుకుంటే చేసిచూపించే నేత అని మా వాడు ఎవరు చిప్పినా   వినడని తాను చేయాలనుకున్నది చేసే తీరుతాడని  అభివర్ణించారు.  ఇటివల సంచలన నిర్ణయాలలో భాగంగా ఆరోగ్యశ్రీ  ని అన్ని రాష్ట్రాలలో సేవలు అందించాలని తీసుకున్న విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. జగన్‌ ఆరునెలల పాలన చాలా బాగుందని పేర్కొన్నారు. నేను గతం లో ఎన్నో ఆరోపణలు చేసిన ఇప్పుడు జగన్‌ ఎదురైతే కలిసి  తప్పకుండా అభినందిస్తానని, ఈ విషయంలో చంద్రబాబు ఏమన్నా పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు హయంలో  జగన్ విషయంలో  కమ్మవాళ్లు గోదావరి, కృష్ణాలో కలిసిపోయారని ఆరోపించిన కానీ జగన్‌ ఎన్నో నామినేటెడ్‌ పోస్టులను రెడ్లకు ఇచ్చారని వారి అభివృద్ధి కోసం పాటుపడతాడని  అందుకు తాను జగన్ ను  మెచ్చుకుంటున్నానని జేసీ తెలిపారు.  అలాగే జేసీ చంద్రబాబు ను కూడా వదల్లేదు. చంద్రబాబు కు జగన్ కి ఉన్న దైర్యం లేదు అని అతడు తీసుకుంటున్న  ఈ తరహా తెగువ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కొందరు దీనికి అయన ఎప్పుడైనా ఇలాగే మాట్లాడతాడని మరి కొందరు పార్టీ మరి యోచనలో ఉన్నాడేమో అని గుసగుసలా డు కుంటున్నారు.  అయితే మరియు టీడీపీ నాయకులు అయన ఎందుకు ఇలా మాట్లాడారో ఆయన్ని కూడా వైసీపీ పార్టీ ఇబ్బందులకు గురిచేయడం వల్లే  ఎలా స్పందించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: