ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌...పెద్ద సంఖ్య‌లో నేత‌లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌డం...ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతుండ‌టంతో స‌హ‌జంగానే... ఆ పార్టీ భ‌విష్య‌త్తుపై తెలుగుత‌మ్ముళ్ల‌లో ఆందోళ‌న నెల‌కొంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఒంట‌రిగా పోరాటం చేస్తున్న‌ప్ప‌టికీ...ఆయ‌న నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం లేక‌జ‌..తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్తుపై భ‌రోసా లేక టీడీపీకి విధేయుల‌నే పేరున్న‌ నేత‌లు బైబై చెప్పేస్తున్న ప‌రిస్థితి. పార్టీ నేతల అసంతృప్తిని దూరం చేయ‌డంలో, పార్టీని ప‌టిష్టం చేయ‌డంలో చంద్రబాబు విఫ‌లం అవుతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు సొంత‌ బావ‌మ‌రిది, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ అండ‌గా నిల‌వ‌లేని స్థితిలో ఉండ‌టమే కాకుండా షాకులు కూడా ఇస్తున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

వాచ్‌మెన్‌పై పెట్రోల్ దాడి...అండ‌గా నిలిచింది తెలంగాణ మంత్రి...డీల్ ఏంటో తెలుసా?

 

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌ను గ‌మ‌నించినా...సాధార‌ణ రాజ‌కీయ ప‌రిస్థితులు అధ్య‌య‌నం చేసినా...ఏపీలో రాజ‌కీయం కొత్త మ‌లుపులు తిరిగేట‌ట్లు క‌నిపిస్తోంది. ఏకంగా చంద్ర‌బాబు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాకే ఎస‌రు ప‌డే ప‌రిస్థితి రావ‌చ్చ‌ని అంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బాల‌య్య వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొద్దికాలంగా ఆయ‌న పట్ల తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తున్న సంగతి తెలిసిందే. బాల‌య్య‌తో పాటు పీఏ కార‌ణంగా తెలుగుదేశం శ్రేణుల్లో, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ని కార‌ణంగా ప్ర‌జ‌ల్లో బాల‌య్య బాబుపై ఆగ్ర‌హం పెల్లుబుకుతోంద‌నేందుకు అనేక‌ నిర‌స‌న ప్ర‌దర్శ‌న‌లే నిద‌ర్శ‌నం. ఇలాంటి త‌రుణంలో...బాల‌య్య త‌న నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెట్ట‌డం అవ‌స‌రం. కానీ బాల‌య్య దీనికి భిన్నంగా, సినిమాలు చేస్తూనే ఉన్నారు.

కేసీఆర్‌కు కొత్త రోగం..దాని పేరెంటో డాక్ట‌ర్లే చెప్పాలి 

తాజాగా అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ...ఆయ‌న అసెంబ్లీలో క్రియాశీలంగా ఉండ‌టం లేదు. ప్ర‌తిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీని వైసీపీ నేత‌లు టార్గెట్ చేస్తున్నప్ప‌టికీ...బాల‌య్య త‌న సినిమా బిజీలో ఉండిపోయారు. సినిమా ప్ర‌మోష‌న్లు, విడుద‌ల‌కు సంబంధించిన ప‌నుల్లోనే ఉంటున్నారు. దీంతో ఇటు టీడీపీ త‌ర‌ఫున గ‌లం వినిపించేందుకో లేదంటే...క‌నీసం హిందూపూర్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు...అసెంబ్లీలో గ‌లం వినిపించేందుకు బాల‌య్య ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం చంద్ర‌బాబుకు షాక్ అని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: