ఇంత కాలానికి చంద్రబాబునాయుడుపై తనలో పేరుకుపోయిన కసిని ఫైర్ బ్రాండ్ రోజా తీర్చేసుకున్నారు. 2014లో ఎంఎల్ఏగా ఉన్న రోజాను అసెంబ్లీ నుండి నిబంధనలకు విరుద్ధంగా అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెండ్ చేశారు. కోడెల సస్పెండ్ చేశారు అనేకన్నా చంద్రబాబునాయుడే సస్పెండ్ చేయించారని చెప్పాలి. స్పీకర్ అధికారాలను ఎవరూ ప్రశ్నించలేరు అన్న ఏకైక అడ్వాంటేజ్ ను చూసుకుని చంద్రబాబు అడ్డదిడ్డంగా వ్యవహరించారు.

 

సీన్ కట్ చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల నాలుగోరోజున అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏలు గోల చేశారు. తమ హక్కులకు అధికారపార్టీ భంగం కలిగిస్తోందంటూ మొత్తుకున్నారు. ఇదే అంశంపై వైసిపి సభ్యులు మాట్లాడారు. ఇందులో భాగంగానే రోజా మాట్లాడుతూ చంద్రబాబును ఓ ఆటాడుకున్నది. అప్పట్లో చంద్రబాబు తనను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేయించినపుడు తన హక్కులు గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు.

 

తన సస్పెన్షన్ అక్రమమని కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నా చంద్రబాబు ఎందుకు లెక్క చేయలేదు ? అంటూ మండిపడ్డారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు అప్పట్లో తనకు మైక్ కూడా ఇవ్వని విషయాన్ని చంద్రబాబుకు గుర్తుచేశారు. అమానవీయంగా తనను మార్షల్స్ తో సభలోనుండి జంతువును లాగేసినట్లు లాగి పడేశారని గుర్తుచేశారు. అసెంబ్లీ కాంపౌండ్ లోకి కూడా తనను రానీయకుండా మార్షల్స్ తో అడ్డుకున్న విషయం టిడిపి సభ్యులకు గుర్తులేదా అంటూ నిలదీశారు.

 

తనను టార్టెట్ చేసుకుని రోజా ఆరోపణలు చేస్తుంటే, విమర్శలు గుప్పిస్తుంటే ఆనాటి సంఘటనలను గుర్తుచేస్తుంటే చంద్రబాబు నోట మాట రాలేదు. అప్పట్లో సిఎంగా ఉన్న చంద్రబాబు మరో పదిహేనేళ్ళు తమదే అధికారమని అనుకున్నారు. అందుకనే వైసిపి సభ్యుల విషయంలో అరాచకంగా వ్యవహరించారు. అయితే ఐదేళ్ళకే సీన్ రివర్సవటంతో ఇపుడు వైసిపి సభ్యుల చేత దారుణంగా క్లాసులు పీకిచ్చుకుంటున్నారు. అందుకనే వైసిపి ఎంఎల్ఏలు ఎంతగా క్లాసులు పీకుతున్నా ఏమీ అనలేక తల దించుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: