నాలుగో రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశంలో భాగంగా... టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టినందుకు తాము వ్యతిరేకత చూపటం లేదని నిండు సభలో ఒప్పుకున్నారు. కానీ తెలుగు మీడియం తప్పనిసరిగా ఉండాలంటూ అధికార పార్టీ వైసీపీకి సూచించారు. చదువుకునేది పిల్లలు, చదివించే తల్లిదండ్రులు.. వాళ్లు ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయం వాళ్ళకే వదిలేయాలని అన్నారు. కేవలం ఇంగ్లీష్ మీడియం పెట్టడం సరికాదని... తెలుగు మీడియం కూడా ఉండాలని అన్నారు. తెలుగు మీడియం లేకపోతే ఇంగ్లీష్ మీడియం లలో ఏది ఇష్టమైతే అది చదివేటట్లు రెండు ఆప్షన్స్ లను పెట్టి విద్యార్థులకు ఎంచుకునే స్వేచ్ఛని ఇవ్వాలని అన్నారు. అయితే... ఇదంతా వింటున్న వైసీపీ నేతల్లోని ఒకరు అలా ఇవ్వాలంటే తెలుగుదేశం ఇంగ్లీష్ దేశంగా మారాలని గట్టిన అన్నారు.


పాపం, ఈ కామెంట్ విన్న అచ్చెన్నాయుడు సగం నిరుత్సహపడ్డారు. అప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం... చిరునవ్వు నవ్వుతూ పాపం అతన్ని మాట్లాడనివ్వండి అంటూ సైగ చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడానికి తాను కానీ చంద్రబాబు నాయుడు కానీ అభ్యంతరం చెప్పడంలేదని, స్వాగతిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

ఇకపోతే వైసీపీ నేతలు చంద్రబాబు ఆరోపణలకు ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొంత మంది నెటిజన్లు, అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మోహంలో తీవ్ర బాధ స్పష్టంగా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శిస్తుంటే చంద్రబాబు పరిస్థితిని చూసి మరికొందరు జాలి పడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తన ఇంగ్లీష్ ని ఎద్దేవా చేసుకోండని.. తనకి ఇంగ్లీష్ రాదని అంటూ... జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ లో పుట్టి పెరిగాడని, దానికి సంతోషపడుతున్నాని మాజీ ముఖ్యమంత్రి సెటైర్ వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: