తెలిసి మాట్లాడాడో లేకపోతే ఏదో నోటికొచ్చింది మాట్లాడాడో తెలియటం లేదు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నారావారి పుత్రరత్నం లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తండ్రి చంద్రబాబునాయుడు గాలి తీసేశారు. మొదటి నుండి కూడా ఏదో మాట్లాడాలనుకుని ఇంకేదో మాట్లాడేయటం లోకేష్ కు అలవాటే.

 

ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతూ ’చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకం’  కాదు అంటూ పెద్ద సామెతను చెప్పారు. అలాగే  ’నాన్న గెలిచిన చోటే గెలవానుకోలేదు’ అంటూ మరో భారీ డైలాగ్ కూడా  చెప్పేశారు. ఇక్కడ లోకేష్ మరచిపోయిందేమిటంటే తాను కొత్తగా చెట్టుపేరు చెప్పి కాయలనమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ అర్హత లేకపోయినా ముందు ఎంఎల్సీ తర్వాత మంత్రి అయ్యింది చెట్టు పేరు చెప్పుకునే అన్న విషయం అందరికీ తెలుసు.

 

ఇక తన తండ్రి రాజకీయాలను ఎలా నెట్టుకొస్తున్నారు ? పిల్లనిచ్చిన మామగారు ఎన్టీయార్ పేరు చెప్పుకునే కదా ? ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచే కదా మొదటిసారి సిఎం అయ్యింది ? ఎన్టీయార్ పేరు చెప్పందే చంద్రబాబు రాజకీయం చేయలేకపోతున్న విషయాన్ని లోకేష్ అందరికీ గుర్తుచేశారు.  ఇక నాన్న గెలిచిన చోటే గెలవాలనుకోలేదు అంటూ మరో ప్రకటన కూడా చేసేశారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు కూడా గెలుస్తాడా లేదా అనే అనుమానాలు వచ్చేశాయి.

 

చంద్రబాబు గెలుపు మీద అనుమానాలు వ్యక్తం చేసింది మరెవరో కాదు స్వయంగా ఆయన భార్య నారా భువనేశ్వరే. వైసిపి ఊపు చూసిన తర్వాత భువనేశ్వరికి అనుమానం వచ్చే నియోజకవర్గంలోని నేతలతో ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా సమీక్షలు చేయటమే కాకుండా వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఇంత చేసి చంద్రబాబు గెలిచింది కేవలం 30 వేల ఓట్ల మెజారిటితోనే. అంటే ప్రతి ఎన్నికకూ కుప్పంలో మెజారిటి తగ్గిపోతోంది లేండి. ఎప్పుడూ లేంది మొన్నటి ఎన్నికల్లో మొదటి మూడు రౌండ్లలో చంద్రబాబు వెనకబడిపోయారు.

 

వైసిపి గనుక గట్టిగా ఓ పట్టుపట్టుంటే చంద్రబాబు కూడా లోకేష్ బాటలోనే నడవాల్సొచ్చేదేమో ? లోకేష్ దృష్టిలో తానో బ్రహ్మాండమైన నాయకుడు. తానెక్కడ నామినేషన్ వేసినా గెలుపే అన్నట్లుగా మాట్లాడారు. తీరాచూస్తే మంగళగిరిలో పోటి చేసి చిత్తుగా ఓడిపోయారు. అధికారంలో ఉన్నపుడే చిత్తుగా ఓడిపోయిన పుత్రరత్నం  రేపటి ఎన్నికల్లో ...  

మరింత సమాచారం తెలుసుకోండి: