ఈశాన్య భారతం రగులుతోంది. మూడు దశాబద్ధాల తర్వాత.. మళ్లీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. చిన్నా పెద్దా తేడా లేదు. అంతా మూడు నాలుగు రోజుల నుంచి రోడ్లపైనే ఉంటున్నారు. ప్రాణాలైనా ఇస్తాం.. క్యాబ్‌ను మాత్రం ఒప్పుకోమని తేల్చి చెతున్నారు. ఇంతకీ పౌరసత్వ సవరణ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు....? 1982 అల్లర్లలో ఏం జరిగింది...? 

 

ఈశాన్య భారతం. ఇదే ఓ మినీ ఇండియా. విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, మరెన్నో భాషలు. మొత్తం ఏడు రాష్ట్రాలున్నా... ఒక్కో రాష్ట్రానికో వైవిద్యం. మాట్లాడే బాష నుంచి కట్టుబొట్టు అన్నీ డిఫరెంట్‌. అలా నాలుగు రాష్ట్రాలుగా ఉన్న ఈశాన్యం.. సెవన్ సిస్టర్స్‌గా విడిపోయింది. బంగ్లా పాక్‌ నుంచి విడిపోయాక... అసలు సమస్య వచ్చిపడింది. బంగ్లా నుంచి ముస్లీమేతర మైనార్టీలు పెద్ద ఎత్తున భారత్‌కు వలసొచ్చారు. అస్సాం, త్రిపురాలో శరణార్థులుగా ఆశ్రయం పొందారు. దీంతో స్థానికులు, స్థానికేతరుల మధ్య ఎప్పుడూ వివాదమే. హింసాత్మకదాడులు జరిగేవి. ఇందులో భాగంగా జరిగినవే నెల్లి, ఖొయ్‌రబారి మారణహోమం. ఈ ఘటనలు తర్వాత.... మొదలైందీ అస్సాం ఉద్యమం.  1979 నుంచి 1985 వరకూ ఈ మూవ్‌మెంట్‌ కొనసాగింది. బంగ్లా నుంచి వచ్చిన బెంగాలీలకు వ్యతిరేకంగా చేపట్టారు. 


1982లో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం..మరింత అగ్గిరాజేసింది. అక్రమంగా వలసొచ్చిన 40లక్షల మందికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఇందుకోసం ఐ.ఎమ్.డి.టి యాక్ట్ కూడా తెచ్చారు. స్థానిక అస్సామీల నుంచి బెంగాలీలను రక్షించేందుకు ఈ  నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి అస్సాం రగులుతూనే ఉంది. ప్రభుత్వాలు మారాయి. కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలసవచ్చిన వారు పౌరసత్వం పొందారు. దీంతో సొంత రాష్ట్రంలో అస్సామీలు మైనార్టీలుగా మిగిలిపోయారు. భయంకర నిజమేంటంటే... బెంగాలీలు కొన్నేళ్ల వరకూ అస్సామీ భాషను కూడా గుర్తించలేదు. 

 

తమ భాష, సంస్కృతి అణిచివేయబడుతుందనేది అస్సామీల వాదన. ఇందిరా గాందీ నిర్ణయంతో ఇప్పటికే రెండో తరగతి పౌరులుగా తాము మిగిలిపోయామని, కేంద్రం ఇప్పుడు వారికి పౌరసత్వం కల్పిస్తే.. తమ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. వలసవాదుల డామినేషన్‌ ఇప్పటికే పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. పౌరసత్వం లభిస్తే.. తాము ఉద్యో అవకాశాలు కూడా కోల్పోతామని చెబుతున్నారు. మిజోరాం, అరుణాచల్‌, నాగాల్యాండ్ తరహా...అస్సాంలోనూ ఇన్నర్ లైన్‌ పర్మిట్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. తమ హక్కులు కోల్పోకుండా..చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: