నిర్భయ నిందితులకు త్వరలోనే ఉరి ఖాయం. తీహార్ జైలు అధికారులు ఇప్పటికే బక్సార్ జైలు నుంచి 11 ప్రత్యేక ఉరితాళ్లను తెప్పించబోతున్నారు. ప్రస్తుతం.. నిందితులు పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ కోవింద్ వద్ద ఉంది. అయితే రాష్ట్రపతి ఖచ్చితంగా ఈ పిశాచుల క్షమాబిక్షను తిరస్కరిస్తాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా, వీరిని ఉరి తీసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలుస్తుంది. దీంతో ఇప్పటివరకూ ఏ చింత లేకుండా బ్రతికిన ఈ నలుగురు నిందితులకు (అక్షయ్, ముకేశ్, వినయ్, పవన్‌)నిద్ర కూడా పట్టట్లేదట. రాత్రులు పడుకోకుండా పిచోళ్ళలాగా తమ జైలు గదుల్లో అటూ ఇటూ తిరుగుతున్నారని తీహార్ జైలు అధికారులు చెప్తున్నారు. 

 


ఇంకా... జైలు అధికారులు పెట్టె భోజనం కూడా అస్సలు ముట్టనే ముట్టట్లేదంట. కనీసం నీరు కూడా త్రాగటంలేదని జైలు సిబ్బంది చెప్పారు. వారి మోహంలో మృత్యుభయం మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని తెలుస్తుంది. ఉరిశిక్ష అమలు చేస్తున్నామని అధికార ప్రకటన రాలేదు కానీ... ఈ నలుగురు దోషులు మాత్రం  బిక్కుబిక్కుమంటూ వింతగా ప్రవర్తిస్తున్నారు. డిసెంబర్ 16... లేకపోతే నిర్భయ చనిపోయిన రోజున అంటే డిసెంబర్ 29వ తారీఖు.. హత్యాచారా దోషులను ఉరి తీస్తారని బలంగా వార్తలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే తీహార్ జైల్లో 5 ఉరితాళ్లు ఉన్నట్లు అధికారాలు చెప్పారు. కానీ బక్సార్ జైలు నుంచి ప్రత్యేక తాళ్లను తెప్పించి.. ఒకరెండ్రు సార్లు ట్రయిల్ వేయనున్నారు. 

 


ఇకపోతే, మొన్నటి వరకు మాండొలి జైలు లో ఉన్న పవన్ కుమార్ గుప్తను తీహార్ జైలుకు తరలించారు. అక్షయ్ సింగ్ ఠాకూర్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ పై ముగ్గురు సుప్రీం కోర్టు న్యాయవాదులు డిసెంబర్ 17 లోపు విచారణ చేపట్టనున్నారని సమాచారం. దోషులను త్వరగా ఉరి తీయాలని నిర్భయ తల్లి పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే శుక్రవారం రోజు పాటియా హౌజ్ కోర్ట్ లో నిర్భయ తల్లి ఆశాదేవి విచారణకు హాజరు అవ్వనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: