ఆడవాళ్లను చూస్తే చాలు వయస్సు మరచి కామంతో రగిలి పోతున్నారు లోకంలోని మగ పురుగులు. ఈ విషయంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఒకటే దొంగ చూపులు చూస్తుంటారు. కొందరు పెద్దరికాన్ని వెలగబెడుతూనే లోపల మాత్రం కోరికలతో రగులుతూ ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని మాటు వేస్తారు. మరి కొందరైతే బయట ఎన్ని వెధవ వేషాలు వేసిన ఇంట్లో వారికి తెలియకుండా జాగ్రత్త పడతారు. మనుమలు, మనవరాలు ఉన్న వీరు తాత వయస్సులో ఉన్నా సిగ్గుమాలిన పనులు చేస్తుంటారు.

 

 

ఇకపోతే ఇక్కడ ఒక ముసలానికి యవ్వనం ఉరకలేయగా  ఓ ఉచ్చులో పడ్డాడు. తీరా అది పెద్ద గొయ్యి అని తెలుసుకుని అందులో నుండి బయటకు రావడానికి తాను సంపాదించిన సొమ్మంతా ధారపోసాడు. ఆ వివరాలు తెలుసుకుంటే. ముంబై లోని ఖర్గర్ కి చెందిన ఓ వ్యక్తికి(65) కోల్‌కతాలోని ఒక నకిలీ కాల్ సెంటర్‌ నుంచి స్నేహా(25) అనే యువతి కాల్ చేసింది. అందులోని సారాంశం ఏంటంటే  అందమైన యువతులతో సరదాగా మీరు గడపాలనుకుంటే తాము ఓ డేటింగ్ సైట్ నిర్వహిస్తున్నామని, .. ఆ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పింది. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి అందులో మెంబర్ షిప్ పొందినట్లయితే వారి ప్రాంతానికి దగ్గరలో ఉన్న యువతులతో సుఖంగా గడపొచ్చని నమ్మబలికింది.

 

 

ఇందుకు గాను కొంత చార్జీలు చెల్లించాలని చెప్పడంతో  ఆ వృద్ధుడు వెనకా ముందు ఆలోచించకుండా అందుకు సరేనని వారు చెప్పిన మొత్తాన్ని చెల్లించాడు. కానీ అతనికి ఆ డేటింగ్ సైట్ ఉపయోగించడం రానందున, తన మెంబర్ షిప్ ని రద్దు చేసి, తాను చెల్లించిన చార్జీలను ఇమ్మని అడిగాడు. అందుకు ఒప్పుకోని ఆ ముఠా.. కాల్ చేసి అందమైన యువతులు కావాలని అడిగినందుకు తిరిగి అతని మీదే పోలీస్ కంప్లయింట్ ఇస్తామని భయపెట్టారు. దీంతో ఆ పెద్ద మనిషి వారి మాటలకు భయపడిన తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిస్తే తన పరువుపోతుందని, ఊరుకున్నాడు.

 

 

కానీ ఇదే అదను అనుకున్న ఆ ముఠా ఆ వ్యక్తి నుంచి మరింత డబ్బు గుంజటానికి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డాడని నకిలీ లీగల్ నోటీసులు పంపారు. తాము అడిగినంత డబ్బు ఇస్తే ఆ లీగల్ నోటీసులను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. దీంతో బెదిరిపోయిన ఆ వృద్ధుడు.. వారు చెప్పిన బ్యాంకు అకౌంట్లకు రూ. 73.5 లక్షలు ట్రాన్సఫర్ చేశాడు. ఇంకా డబ్బు పంపించాలని డిమండ్ చేయడంతో దిక్కు లేక ఖర్గర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి, ఆ నకిలీ కాల్ సెంటర్ ముఠాకి చెందిన స్నేహ అనే యువతితో పాటుగా,  ఓ ట్రాన్స్ జెండర్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: