నేటి కాలంలో పేద విద్యార్దులకు ఆంగ్ల విద్య చాలా కష్టం అయిపోయింది. మద్యతరగతి జీవిని కనీసం ప్రైవేట్ పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనంతగా ఫీజులు గుంజుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల సంగతి చెప్పక్కర్లేదు. దుమ్ముపట్టి కొట్టుకుపోయే స్దితిలో ఉన్న ఈ స్కూల్లో ఇంగ్లీష్ విద్యను ఏపి ప్రభుత్వం ప్రవేశ పెట్టడం వల్ల ఎందరో పేద విద్యార్ధులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది అనడమంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

 

 

ఇకపోతే ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. అసెంబ్లీలో ఈ విషయం పై జోరుగా చర్చ జరుగుతున్న నేపధ్యంలో జగన్ మాత్రం ఈ విధానాన్ని అమలు చేయడంలో వేనకడుగు వేసేది లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి వీధి బడి తల వంచుకునే బతికేస్తోంది. ఈ పోటీ ప్రపంచంలో ప్రైవేటు స్కూళ్ల వేగం అందుకోలేక కన్నీరు పెడుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది..

 

 

ఎక్కడైనా జరిగే ఇంటర్వ్యూలలో, గ్రూప్‌ డిస్కషన్లలో, పోటీ పరీక్షల సమయంలో ‘కార్పొరేట్‌’ పిల్లలతో పోటీ పడలేక చతికిలపడుతూనే ఉన్నారు.అందుకే జగన్ పేదప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిపక్షాల నుంచి ఊహించని ఎదురుదాడి కనిపిస్తోంది. వాస్తవానికి విమర్శించే వారి పిల్లలంతా ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతుండడం గమనార్హం. ఇంటిలో పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తూ సామాన్యుల పిల్లల విషయంలో మాత్రం కొత్త భాష్యాలు పలుకుతున్నారు కొందరు నాయకులు.

 

 

ఇకపోతే రాష్ట్రంలో పేదల జీవితాలు మార్చడం కోసమే ఇంగ్లిష్‌ మీడియం విద్య ప్రవేశపెట్టామని, దేశం మొత్తం గర్వపడేలా ఈ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాల పిల్లలు కూడా బాగా చదువుకుని అన్ని రంగాలలో ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని ‘రైట్‌ టు ఇంగ్లిష్‌ మీడియఅన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: