కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది . ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో కూడా సభ్యులందరూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని  శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రేప్ ఇన్  ఇండియా అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభలో నేడు  తీవ్ర చర్చ జరుగుతుంది.కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళలను అవమానిస్తూ మాట్లాడారని కాంగ్రెస్ ఎంపీలు మినహా మిగతా ఎంపీలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాహుల్ గాంధీని  శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు  ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి కఠినంగా శిక్షించాలి అని మహిళలు అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ డిమాండ్ చేసింది. 

 


 ఇక  రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ  స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్ సభలో మాట్లాడిన ఆమె... ఓ వైపు దేశ ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంటూ పిలుపునిస్తూ ఉంటే రాహుల్ గాంధీ మాత్రం రేప్ ఇన్ ఇండియా అని అంటున్నారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే మహిళలపై అత్యాచారాలకు పాల్పడి రేపులు చేయాలి అంటూ రాహుల్ గాంధీ అందరికీ పిలుపునిస్తున్నారా  అంటూ ఆమె ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారత మహిళలు అందరినీ అవమానించేలా ఉన్నాయని... భారత మహిళల తో పాటు భారతమాతను కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

 


 కాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు మాత్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో రాహుల్ గాంధీని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా స్పందించి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా  సభలో బీజేపీ ఎంపీలందరూ రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా నినాదాలు చేశారు. ఇక మరో వైపు నుంచి కాంగ్రెస్ సహా మిగతా ఎంపీలు కూడా నినాదాలు చేయడంతో లోక్ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ ఎంతసేపటికి అదుపులోకి రాకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: