రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అత్యాచారాలు పెరిగిపోయాయి. పాలు తాగే పసిపాపలనూ వదలడం లేదు.. పండు ముసలోళ్లనూ వదలడం లేదు కామాంధులు. అడవుల్లో తోడేళ్లలా కాచుకొని మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మానవత్వం అనేది ఏమాత్రం లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అత్యాచారాలకు ఒడిగట్టడమే కాదు.. తమ ఘనకార్యం ఎక్కడ బయటపడుతుందోనని బాధితులను చంపేస్తున్నారు. ఇందుకు సరైన ఉదాహరణ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ ఘటన. 


దిశపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులను కాల్చిపారేయాలంటూ దేశం అంతా అట్టుడికింది. దీంతో ఎన్ కౌంటర్ లో ఆ నీచులను కాల్చివేశారు. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా స్వాగతించారు. పక్కరాష్ట్రంలో జరిగిన ఇలాంటి దారుణ ఘటన తమ రాష్ట్రంలో జరుగకూడదని నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో భాగంగా మహిళల భద్రత కోసం కఠిన చట్టాన్ని రూపొందించడమే కాదు ఆమోదించింది కూడా. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షం కూడా స్వాగతించింది.  


ఇదిలా ఉండగా.. ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లు ఆమోదం పొందిందో లేదో.. అపుడే గుంటూరులో ఓ అఘాయిత్యం వెలుగు చూసింది. గుంటూరు నగరంలోని రామిరెడ్డి నగర్ లో మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలికపై ఓ ఇంటర్ విద్యార్థి అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు కూడా నిర్ధారించారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధిత బాలికను గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో దిశ బిల్లు ప్రవేశపెట్టి.. ఆమోదం పొందిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరుగడం గమనర్హం. మొత్తానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన నేరాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్టే ఒక్కటే. కఠినంగా శిక్షలు అమలు చేయడం. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలను నేర్పించడం. ఇటు తల్లిదండ్రులు.. అటు గురువులు తమ విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడం నేర్పించినపుడే సమాజం బాగుపడుతుంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: