ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా నేను మోసపోయాను అనే మాటలు తరచుగా వినిపిస్తాయి. ఈ కాలంలో మోసపోయేవారు ఎలా తయారవుతున్నారో, మోసంచేసే వారు కూడా అలానే పుట్టుకొస్తున్నారు. ఓ క్షణం ఎమరుపాటుగున్న కనురెప్పపాటులో జరగవలసిన మోసం జరిగిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది ఇదే. ఒక పని చేసే ముందు దాని గురించి ఆలోచించరు. తీరా నష్టం జరిగాక మాత్రం పదిమందిలో లబోదిబో మంటారు. ఇకపోతే స్మార్ట్‌ ఫోన్స్‌కు చార్జింగ్ పెట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు సూచిస్తుంది.

 

 

మోసగాళ్లు మాల్వేర్‌బైట్స్‌ ద్వారా సమాచారం తస్కరించే అవకాశముందని హెచ్చరించింది. సైబర్ క్రైమ్ నిపుణుల ప్రకారం.. మాల్వేర్, ఫిషింగ్, అల్గరిథమ్ వంటి వాటి సాయంతో స్మార్ట్‌ఫోన్‌ నుంచి వివరాలు కొట్టేసే ప్రమాదముంది. ఆటో డేటా ట్రాన్స్‌ఫర్ డివైజ్ ద్వారా హ్యాకర్ల ఈ పని పూర్తి చేస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే ఇవి 300 నుంచి 400 డాలర్లకు అలీబాబా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందుకే పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..

 

 

పబ్లిక్ ఉన్న ప్రదేశాల్లో దొగనాయాళ్లు ఉంటారు. ఈ హ్యాకర్లు లేదా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేవారు ప్లగ్ ఇన్ కార్డు ఉపయోగిస్తారు. వీటిని ఆటో డేటా ట్రాన్స్‌ఫర్ డివైజ్ అని కూడా పిలుస్తారు. చార్జింగ్ స్టేషన్‌లో వీటి ద్వారా ఫోన్‌కు చార్జింగ్ పెట్టినప్పుడు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. చాలా మంది దీన్ని చదవరు. ఓకే కొట్టేస్తారు. ఇక్కడి నుంచే డేటా తస్కరణ ప్రారంభమౌతుంది’ అని న్యూఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు ఒకరు వివరించారు.

 

 

అందుకే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే సొంత చార్జర్‌తోనే ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకోవాలి. ఇదే కాకుండా స్మార్ట్‌ఫోన్‌లో యాంటి మాల్వేర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు... లేదంటే ఒక పవర బ్యాంక్ ఎప్పటికి వెంటపెట్టుకోవడం మంచిదని తెలుపుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: