దిశ ఘటనతో నిర్భయ చట్టానికి ఏమాత్రం విలువ లేదని తేలిపోయింది. అలాగే దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత కూడా మృగాళ్ళల్లో ఎటువంటి మార్పు రాలేదని తాజాగా స్పష్టమైంది.   తాజాగా నాంపల్లిలోని ఓ హోటల్లో జరిగిన అత్యాచార ఘటన సంచలనంగా మారింది.

 

చాంద్రాయణగుట్ట పోలీసులు చెప్పిన ప్రకారం  ఇద్దరు అక్కా, చెల్లెళ్ళు ఛార్మినార్ చూద్దామని అనుకున్నారు. ఆటోకోసమని షహ్మాబాద్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వీళ్ళని కొద్దిసేపు  గమనించిన ఓ ఆటో డ్రైవర్  మహ్మద్ అమీర్ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ఛార్మినార్ తో పాటు జహింగీర్ పీరా దగ్గరకు కూడా తీసుకెళతానని బేరం మాట్లాడుకున్నాడు. బేరం కుదిరిన తర్వాత అక్కా, చెల్లెళ్ళిద్దరూ ఆటో ఎక్కారు.

 

కొద్ది దూరం వెళ్ళన తర్వాత వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళ విషయాలు తెలుసుకున్నాడు. సగం దూరం పోయిన తర్వాత  సాయంత్రం దర్గాల దగ్గరకు వెళ్ళటం ఏమంత మంచిది కాదని తెల్లవారి తీసుకెళతానని చెప్పి వాళ్ళని ఒప్పించి తన ఇంటికి తీసుకెళ్ళాడు. కొత్తవాళ్ళని చూడగానే అమీర్ ఇంట్లో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో అమీర్ తమ్ముడు మూసా కల్పించుకుని వీళ్ళద్దరిని నాంపల్లిలో దించేస్తానని చెప్పి తన మోటారు సైకిల్ పై ఎక్కించుకుని తీసుకొచ్చేశాడు.

 

అయితే వీళ్ళద్దరినీ నాంపల్లిలో వదిలేయకుండా  ఓ హోటల్ ను బుక్ చేసి అందులో ఉంచాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత లోపల తలుపేసుకుని చెల్లిని చంపేస్తానని చెప్పి అక్కపై చాలాసార్లు  అత్యాచారం జరిపాడు.  తర్వాత వాళ్ళిద్దరినీ హోటల్ నుండి తీసుకొచ్చి ఉప్పుగూడ రైల్వే స్టేషన్ లో  వదిలేసి వెళ్ళిపోయాడు.

 

అదే సమయంలో  అక్కా, చెల్లెళ్ళిద్దరు ఈనెల 8వ తేదీ నుండి కనిపించటం లేదని వాళ్ళ కుటుంబసభ్యులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.  రైల్వేస్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వీళ్ళద్దరినీ రైల్వే పోలీసులు దగ్గరకు తీసుకుని విచారించారు. తర్వాత చాంద్రాయణగుట్ట పోలీసులకు కబురుచేశారు. వీళ్ళు చెప్పిన విషయాలను తెలుసుకుని నాంపల్లిలోని హోటల్ కు వెళ్ళి వాకాబు చేస్తే నకిలీ గుర్తింపు కార్డు చూపించి రూం తీసుకున్న విషయం బయటపడింది. సరే పోలీసులు ప్రస్తుతం కేసు బుక్ చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: