రాజు రవి తేజ..  తెర మీద కనిపించే పవన్ కళ్యాణ్ అభిమానులకు పవనిజం పదాన్ని సృష్టించిన వ్యక్తి. పవన్ కి అత్యంత సన్నిహితుడు ఈ రాజు రవి తేజ. అయితే రాజు రవి తేజ కి పవన్ జీవితం గురించి ఆయన ఆశయాల గురించి ఆయన ఆలోచనల గురించి పూర్తిగా తెలుసు. అందుకే పవన్ జీవితం గురించి ఆయన పవనిజం అనే  పుస్తకాన్ని రాయడంతో పవనిజం అనేది తెర మీదికి వచ్చి వైరల్ అయిపోయింది. అంతేకాదండోయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి రాజు రవితేజ ఆలోచనలే కారణమని కూడా ఊహాగానాలు  ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ జీవితాన్ని అతి దగ్గర నుంచి చూసిన  పవన్ కళ్యాణ్ అభిమాని అయిన రాజురవితేజ  పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన లో కూడా కొనసాగారు. 

 

 

 అలాంటి రాజు రవితేజ ప్రస్తుతం జనసేనకు స్వస్తి పలుకుతూ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జనసేన పార్టీ పోలిట్ బ్యూరో పదవిలో కొనసాగుతున్న రాజు రవి తేజ జనసేన పార్టీకి పదవికి రాజీనామా చేశారు. దీంతో పవన్ కి గట్టి షాక్ తగిలినట్లయింది. ఇకపోతే రాజు రవితేజ రాజీనామా చేస్తూ చేస్తూ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. పవన్ జీవితాన్ని అత్యంత సన్నిహితంగా చూసిన వ్యక్తి పవన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. ఇంతకీ రాజు రవితేజ లేఖలో ఏం వ్యాఖ్యలు చేశాడో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 

 

 

 పవన్ ఒకప్పుడు మంచి మనిషి అని కానీ ఇప్పుడు మాత్రం కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారు అంటూ రాజు రవి తేజ రాసిన లేఖలో పేర్కొన్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి నచ్చక పోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పవన్ ఒక ప్రమాదకర విభజన శక్తిగా మారిపోయారని  లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాజు రవి తేజ. జనసేన పార్టీ పుట్టుకలో తాను కీలక పాత్ర పోషించారని తెలిపిన రాజ రవితేజ... జనసేన మొదటి ప్రధాన కార్యదర్శిని తానేనని.. ప్రస్తుతం పోలిట్బ్యూరో సభ్యుడునని...కానీ  ప్రస్తుతం పవన్ వ్యవహార శైలి నచ్చకనే జనసేన నుంచి వైదొలుగుతున్నాను అంటూ ఆయన లేఖలో పేర్కొన్నాడు.

 

 

 

 ప్రస్తుతం పవన్ కళ్యాణ్  కక్షసాధింపుతో  తనం కుల మత పరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తి గా మారిపోయారు  అంటూ రాజు  రవితేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అధికారానికి అనర్హుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సమాజానికి హానికరం అంటూ రాజు రవి తేజ లేఖలో పేర్కొన్నట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: