ఎర్రగడ్డలోని మానసిక వ్యాధుల చికిత్సాలయం అనే చ‌క్క‌టి పేరుకంటే...ఎర్ర‌గ‌డ్డ మెంట‌ల్ ఆస్ప‌త్రి అంటేనే చాలామందికి ప‌రిచితం. జ‌నాలు...ఈ ఆస్ప‌త్రిని అలా మార్చేశారు మ‌రి! వాస్త‌వంగా ఈ ఆస్ప‌త్రిలో ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల కార‌ణంగా చేరిన వారికి ఎంతో మంచి చికిత్స అందిస్తున్నారు. వారిని బాగుచేస్తున్నారు. కానీ..ఎర్ర‌గ‌డ్డ అన‌గానే..ఓ ముద్ర ప‌డిపోయింది. స‌రే ఈ చ‌ర్చ ఇలా ఉంచితే...తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇదే ఎర్రగడ్డలోని మానసిక వ్యాధుల చికిత్సాలయం సాక్షిగా...అదే ఆస్ప‌త్రిలోని ప‌రిణామాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

 

 

ఎర్రగడ్డలోని మానసిక వ్యా ల చికిత్సాలయ ప్రాంగణానికి విచ్చేసిన  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌...అకడమిక్‌ బ్లాకులోని అన్ని విభాగాలను పరిశీలించారు. దవాఖానలో విధులు నిర్వహించే సిబ్బందితో ముచ్చటించారు. అంత‌కుముందు చికిత్సాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ‘అకడమిక్‌ బ్లాకు’ భవనాన్ని  మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ ప్రారంభించారు. దీంతోపాటు ఔట్‌ పేషం ట్‌ బ్లాకులో నూతనంగా ఏర్పాటు చేసిన డీటీసీ(డ్రగ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌), ఓసీడీ(ఒబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిసార్డర్స్‌) క్లినిక్‌లను కూడా మంత్రి ప్రారంభించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి దావాఖానకు వచ్చే రోగులకు వైద్యం అందించడం ఎంత ముఖ్యమో అదేరీతిలో కౌన్సెలింగ్‌ కూడా ఇవ్వడం అంతే ముఖ్యమని అన్నారు. 

 

మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సం ఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గించే అంశమని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సమస్య ముదిరితే ఉన్మాదులుగా మారే ప్రమాదముంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. మానసిక వ్యాధి ఉన్నదని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లలను చికిత్స కోసం తీసుకెళ్లటం లో జాప్యం చేస్తున్నారని.. సత్వర చికిత్సను జరిపించి మామూలు మనుషులుగా మార్చాల్సిన బాధ్యత కుటుం బ సభ్యులపై ఉన్నదన్నారు. దవాఖాన ఆవరణలో రూ.30 కోట్లతో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌' భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. తద్వారా సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుందని వివరించారు. ఇందులో భా గంగా అకడమిక్‌ బ్లాకును ప్రారంభించటం జరిగిందన్నా రు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: