దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత వారి మృతదేహాలను మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి లో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రి నుంచి దోషుల స్వగ్రామాలకు తరలించి ఖననం చేయాలని పోలీసులు భావించారు. కానీ కొన్ని రోజుల క్రితం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మృతదేహాలను భద్రపరచమని ఆదేశించడంతో ఖనన కార్యక్రమాలు ఆగిపోయాయి. ప్రస్తుతం దోషుల బాడీలు గాంధీ ఆసుపత్రి లోని మార్చరీ లో ఉన్నాయి.

 

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. మృతదేహాలను నిందితుల కుటుంబాలకు అప్పగించడానికి ఇంకా కొన్ని రోజులు ఆలస్యం అయ్యేట్లు తెలుస్తుంది. దీంతో ఎన్ కౌంటర్ జరిగి దాదాపు 10 రోజులవుతున్నా మృతదేహాలను అప్పగించలేదని నిందితుల కుటుంబ సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు వారి కొడుకుల మృతదేహాలు ఖననం కోసం ఇవ్వాలని డిమాండ్ చేసిన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు వద్దని చెప్తున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే... 'మాకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాలకు ఖననం చెయ్యనియం' అని అంటున్నారు.


ఏదేమైనా... మృతదేహాలను ఇన్ని రోజులు భద్రపరచడం పోలీసులకు సవాల్ గా మారింది. అవి చెడిపోకుండా ఉండటానికి అధికారులు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే... వేలాది రూపాయలను వెచ్చిస్తున్నారు. ఒక్క మృతదేహానికి ఇచ్చే ఇంజక్షన్ ఖరీదు అక్షరాలా 7,500 రూపాయలట. ఈ విలువైన ఇంజక్షన్ ఇస్తే అవి పాడవ్వకుండా ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. హై కోర్ట్ ఎప్పుడు ఖననం చేయమని చెబుతుందో అప్పటి వరకు వాటిని తప్పనిసరిగా భద్రపరచాల్సి ఉంటుంది. ప్రతి వారానికి ఒక్కసారి నలుగురి మృతదేహాలకు ఇంజక్షన్ ఇస్తున్నారు పోలీసులు. ఇంజక్షన్ ఇస్తే 4 నెలల వరకు చెడిపోకుండా ఉంటాయని చెబుతున్నారు పోలీసులు.

ఇకపోతే, దిశ హత్యాచారా దోషులు చెపినట్లు.. దిశ మృతదేహంలో మద్యం ఉన్నట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో నిపుణులు నిర్ధరించారు. దోషులు బలవంతంగా తాగించిన మద్యం.. దిశ కాలేయంలో ఉన్నట్లు తేల్చారు నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: