సాధారణంగా పాము అంటే కిలో మీటరు దూరం పరుగెడతారు.. కానీ పాములను పట్టుకోవడం ప్రొఫెషన్ గా పెట్టుకున్నవారు ఎలాంటి పాము అయినా వేటాడి మరీ పట్టుకుంటారు.  అయితే కొన్నిసార్లు ఆ పాము వల్లే ప్రాణాలు పోగొట్టుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి.  ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని భయంకరమైన విష సర్పాల వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.  కొన్నిసార్లు సరైన సమయానికి చికిత్స పొంది ప్రాణాలు రక్షించుకున్నవారు కూడా ఉన్నారు.  తాజాగా ఓ వ్యక్తి పాము బావిలో పడిందని తెలుసుకొని దాన్ని కాపాడబోయి చివరకు తానే ప్రమాదంలో ఇరుక్కున్నాడు.

 

ఈ ఘటన ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది. పాములు పట్టడంలో మంచి అనుభవం ఉన్న షగిల్  ఓ పాము బావిలో పడటంతో షగిల్‌.. వల వేసి దాన్ని బయటకు తెద్దామనుకున్నాడు. కానీ ఆ బావి లోతుగా ఉండటంతో అది కుదర్లేదు. ఇక లాభం లేదనుకొని ఆ బావిలోకి తానే స్వయంగా దిగాడు.. వెంటనే తాళ్ల సాయంతో ఎలాగోలా బావిలోకి దిగాడు.  పాము కాటు వేయకుండా నెమ్మదిగా దాని తలను అదిమి పట్టుకున్నాడు. అయితే అది చాలా పొడగైన పాము కావడంతో ఒక్కసారే షగిల్ ని  శరీరాన్ని చుట్టుకుంది.

 

దీంతో అక్కడి స్థానికులు ప్రమాదం ఉందని అతడిని పైకి లాగారు. అంతలోనే  చేయి పట్టుతప్పడంతో ఒక్కసారిగా పాముతో పాటు అతను కూడా బావిలోకి పడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి ఆ పాము, షగిల్ క్షేమంగా బయట పడ్డారు.  ఈ సందర్భంగా షగీల్ మాట్లాడుతూ.. ఆ పాము కాటు వేయకుండా ముందుగా తల పట్టుకున్నానని..దాంతో అది భయంలో నా శరీరాన్ని చుట్టుకుంది.. అయినా బయటకు రావాలని చూసినా.. వాళ్లు ఆలస్యం చేయడంతో అంతలోనే పట్టు కోల్పోయి బావిలో పడిపోయానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సంఘటనలు తనకు కొత్తవేమీ కావని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: