నిర్భయ.. ఈ ఘటన గురించి ఎంత చెప్పిన తక్కువే.. 9 గంటల సమయంలో అమ్మాయి బస్సు ఎక్కితే 11 గంటలకు కారుతున్న రక్తంతో బట్టలు లేకుండా నడిరోడ్డుపై ఆ యువతీ పడింది. అది కూడా 5 పర్సెంట్ పేగులతో. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? ఆశ్చర్యంలో తప్పు లేదు. ఎందుకంటే... అంత దారుణమైన ఘటన అది. ఇంకా అసలు కథలోకి వెళ్తే.. 2012 డిసెంబర్ 16.. చలికాలం అది. ఆ సమయంలో ఓ యువతీ, యువకుడు ప్రైవేట్ బస్సు ఎక్కారు. 

 

ఆ బస్సులో కేవలం డ్రైవర్ తో సహా ఆరుమంది ఉన్నారు. అంతే.. కొద్దీ సమయానికి ఆ ఆరుమందిలో ఒకరు వచ్చి.. ఎందుకు ఇంతవరుకు బయట ఉన్నావ్ అంటూ అమ్మాయిపై చెయ్యి వేశాడు. అనంతరం ఆమె తిట్టడంతో కోపంతో ఊగిపోయిన వారు ఆమెని, ఆమె స్నేహితుడును ఇనుప రాడ్ తో కొట్టారు. అత్యాచారణానికి సహకరించమని ఆమెకు ఎంత చెప్పిన వినకపోయేసరికి పక్కనే ఉన్న రాడ్ తో కొట్టారు. దారుణంగా ఆ ఆరుమంది ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అయినప్పటికీ వారికీ ఇంకా కసి తిరక ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్ పెట్టి దాదాపు 95 శాతం పేగులను బయటకు తీశారు ఆ నీచులు. 

 

ఈ ఘటన జరిగిన 14 రోజులకు నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి మరణించింది. అయితే అప్పట్లో ఈ కేసుపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ నిరసనలకు ఫలితంగా ఆ నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే ఆ నీచులలో ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించగా.. మరొకరు టీనేజర్ అని ఉరి నుండి తప్పించుకున్నాడు. అయితే మిగితా నాలుగురు గత 8 ఏళ్ళ నుండి పందులు మేసినట్టు జైల్లో మేశారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిందితులకు ఉరి శిక్ష ఖరారైంది. అధికారుల నుంచి పలానా రోజు ఉరి తీస్తున్నామని ప్రకటన ఇప్పటికి రాకపోయినా.. తలారి కోసం వెతుకులాట, ఉరి తాళ్లను సిద్దం చెయ్యడం, ఆ ఉరి గదిని శుభ్రపరచడం లాంటి పనులు ఊపందుకున్నాయి. 

 

ఈ నేపథ్యంలో వారిని త్వరలోనే మరణ శిక్ష ఖాయమని  ప్రచారం రోజురోజుకూ జోరందుకుంటుంది. అయితే నిర్భయ దోషుల ఉరి శిక్షకు సంబంధించి సుప్రీంలో సంచలన పిల్ దాఖలైంది. ఆ నలుగురు దోషులకు ఉరి వేయడాన్ని టీవీ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని, అమెరికాలో మాదిరిగానే నిర్భయ కుటుంబసభ్యుల సమక్షంలో దోషులను ఉరి తియ్యాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. అయితే ఉరి శిక్ష మరికొన్ని రోజులు ఆలస్యం కానుంది. దోషిగా నిర్ధారించిన అక్షయ్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెల 17న ఈ పిల్‌పై మరోసారి వాదనలు జరగనున్నాయి. కాగా మిగిలిన ముగ్గురు దోషులు గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాటిని తిరస్కరించింది. మరి ఈ అక్షయ్ విషయంలో ఎం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: