తెలంగాణలో సంచలనం సృష్టించిన సమత హత్యకేసులో పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు సేకరించారు. ఫోరెన్సీ, డి.ఎన్.ఎ  రిపోర్టు ఆధారంగా టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సంపాదించారు. 

 

సమత హత్యకేసులో పోలీసుల విచారణ పూర్తైంది. కేవలం 20 రోజుల్లోనే సమగ్ర దర్యాప్తు పూర్తి చేశారు పోలీసులు. ఫాస్ట్రాక్‌ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కొమ్రుంభీం జిల్లా ఎస్పీ.. ఫోరెన్సిక్‌ ఆధారాలు, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను ఆదిలాబాద్‌ ఫాస్ట్రాక్‌ కోర్టుకు సమర్పించారు. పూర్తి ఆధారాలు సేకరించామని నిందితులు తప్పించుకోలేరన్నారు ఎస్పీ.

 

 
ఈ కేసులో  కీలకంగా మారిన ఫోరెన్సిక్‌ రిపోర్టు శుక్రవారమే పోలీసులకు అందింది. సమత మృతదేహాంపై లభించిన బ్లడ్‌, స్పెర్మ్‌.. నిందితులతో మ్యాచ్‌ అయ్యింది. టెక్నికల్ ఎవిడెన్స్‌లో కూడా నిందితులు తేలడంతో... ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఎల్లపటార్‌కు చెందిన షేక్‌ బాబా, షాబోద్దీన్‌, ముగ్దుం అనే ముగ్గురు హత్య చేసినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. డిఎన్ఎ, ఎఫ్.ఎస్.ఎల్  రిపోర్టులో.... ఏ2, ఏ3ల వద్ద స్పెర్మ్‌,  ఏ1వద్ద రక్తం మ్యాచ్ అయినట్లు షార్జ్ షీట్‌లో పేర్కొన్నారు పోలీసులు. ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్టులో మెడకత్తిరించి చేతులు కట్ చేసి చంపినట్లు పేర్కొన్నారు. మొత్తం 44 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. 

 

దిశ హత్యకేసు తర్వాత సమతకు న్యాయం చేయాలని డిమాండ్‌ వచ్చింది. దీంతో ప్రభుత్వం ఫాస్ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసింది. పోలీసులు ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేయడంతో త్వరలోనే ట్రయల్స్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే .. నిందితుల తరఫున వాదించొద్దని ఇప్పటికే జిల్లా బార్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కోర్టు కావడంతో... కొద్ది రోజుల్లోనే ట్రయల్స్‌ పూర్తయ్యి తీర్పు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు న్యాయ నిపుణులు. మొత్తానికి కీలక ఆధారాలతో సమతపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను పట్టుకున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: