మధ్యతరగతి కుటుంబాలలో ఆత్మహత్యలు జరగడానికి ముఖ్య కారణం ఆర్ధిక సమస్యలే అన్న విషయం అందరికి తెలిసిందే. చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చాలి చాలని జీతాలతో  కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి వచ్చే నెలవారీ ఖర్చులు, ఇంటి అద్దెలు కట్టలేక తమ పిల్లలిని పోషించుకోలేక, మంచి చదువులు చెప్పించలేక చాలా మంది తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే గతకొంత కాలంగా కార్పోరేట్ విద్యా సంస్థల వేధింపులకు అకాడమీ ఒత్తిళ్ళకు అభం శుభం తెలియని విద్యార్థులు నిండుప్రాణాలను కోల్పోతున్నారు. అలాంటి ఒక దురదృష్ఠకరమైన సంఘటన తాజా ఒకటి వెలుగు చూసింది. 

 

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదర్‌గూడలోని నలంద నగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్న పవన్.. రైలు కింద పడి దుర్మరణం బలవనర్మణం చెందాడు. ఆర్థిక సమస్యల కారణంగా అతడు ఫీజు చెల్లించలేకపోయాడని.. ఫీజు చెల్లించాలని అకాడమీ నుంచి ఒత్తిడి ఎక్కువైందని సమాచారం. గతంలోను ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అయినప్పటికి ఫీజు చెల్లించలేదన్న నెపంతో యాజమాన్యం విద్యార్థులను వేధిస్తూనే ఉన్నారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టం అంటూ కోచింగ్ అకాడమీలలో ఇష్టమొచ్చినట్టు ఫీజులు గుంజుతూ తల్లిదండ్రులను పిల్లలను మనోవేధనకు గురి చేస్తున్నారు. దాంతో పిల్లలకి సరైన చదువు చెప్పించలేకపోతున్నామనే బాధతో తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల ముందు అవమానించారన్న వ్యధ తో పిల్లలు ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు.  

 

అకాడమీ వేధింపులు భరించలేకే నవీన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. విద్యార్థి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే అకాడమీ యాజమాన్యం పరారైంది. అకాడమీ తీరు వల్లే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ.. సహచర విద్యార్థులు అకాడమీ ముందు ఆందోళకు దిగారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: