ప్రస్తుత సమాజంలో ఉన్న మృగాలు సామాన్య ఆడదాన్ని కాదు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఆడవాళ్ళని కూడా లెక్క చేయడం లేదు. విషయంలోకి వెళితే ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో ఆడవాళ్లకు సంబంధించి అసభ్యకరమైన పోస్టులు పోస్ట్ చేస్తూ రాక్షసానందం పొందుతూ వస్తున్నా ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల దిశా అత్యాచారం హత్య ఘటన లో గుంటూరు జిల్లాకు చెందిన స్మైలీ నాని అనే వ్యక్తి అసభ్యకరమైన పోస్టులు పెట్టి జైలుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసినదే. ఇప్పుడు ఇదే తరుణంలో వైసిపి పార్టీ లేడీ ఎమ్మెల్యే గుంటూరు జిల్లాకు చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని పై బూతు పోస్టులు పలువురు యువకులు పెట్టడంతో పోలీసులు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకులను లాక్కెళ్లి జైల్లో వేసినట్లు సమాచారం.

 

గతంలో కూడా ఎన్నికలు జరగకముందే ఎన్నికల సమయం వాతావరణంలో కావాలని తెలుగుదేశం పార్టీ ప్రముఖ మంత్రి ఆమె ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లాకు చెందిన యువకులు చేత తన పై అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఇప్పుడు ఇదే విధంగా తాజాగా అరెస్టయిన నెల్లూరు యువకుల వెనుక కూడా ఉన్నది ప్రత్తిపాటి పుల్లారావు అని రజినీ ఆరోపిస్తున్నారు. మరోపక్క గుంటూరు జిల్లా పోలీసులు సదరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 

ప్రస్తుతం ఈ వార్త వైసీపీ వర్గాల్లో మరియు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటీవలే అసెంబ్లీలో దిశ యాక్ట్ కింద చట్టం చేసిన నేపథ్యంలో మొట్టమొదటిసారి అసెంబ్లీ లో ఉన్న మహిళా ఎమ్మెల్యే పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం తో ఈ యువకులకు ఎలాంటి శిక్ష పడుతుందో అని అందరూ గమనిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం తనపై ప్రత్యర్థి పార్టీల నాయకులు ఇదంతా కుట్ర పని చేస్తున్నారని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు అన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజిని విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: