భారతీయ జనతా పార్టీకీ ఈ సంవత్సరం అంతగా బాగున్నట్లుగా లేదు. ఎందుకంటే బీజేపీ2019 వ సంవత్సరంలో చాలా మంది ముఖ్యనేతల్ని, నాయకుల్ని కోల్పోయింది. అందులో బీజేపీ నేత మరియు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరణించిన సంగతి తెలిసిందే.

 

 

ఇకపోతే పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి. తన నాయకత్వంతో నవ భారత నిర్మాణానికి బాటలు వేసిన నాయకుడు వాజ్‌పేయి. భారత పదో ప్రధాన మంత్రిగా, బీజేపీ కురువృద్ధుడుగా, పార్టీ తొలి అధ్యక్షుడి గా కీర్తి గడించిన మహానేత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్‌ స్వామి (90) కన్నుమూశారు.

 

 

గత కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ నిన్న ఆదివారం మరణించారు. ఈశ్వర్ దయాళ్‌ స్వామి 1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించిన ఐడీ స్వామి గా పిలవబడే ఈయనా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు.

 

 

స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వెలిబుచ్చారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా కూడా ఎంపికయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

 

 

కాగా గతవారంమే స్వామి భార‍్య పద్మ కన్నుమూయగా వారం రోజుల వ్యవదిలోనే ఈశ్వర్ దయాళ్‌ స్వామి కన్నూ మూయడంతో వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుము కున్నాయి.. ఇకపోతే కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం గాని రేపు గాని ఈయన పార్దీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా సమాచారం..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: