ఒకటే ఇల్లు, రెండు మూడు విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వారికి విద్యుత్ శాఖ షాక్ ఇవ్వనుంది. వంట ఇల్లు ప్రాతిపదికన విద్యుత్ బిల్లు ను వసూల్ చేయనున్నారు. సాధారణంగా మన ఇళ్లలో రెండు పోర్షన్లు ఉండి ఈ రెండు పోర్షన్ల వారికి కామన్ గా మోటార్, బోరు, లైటింగ్ మనం ఇంకొక కనెక్షన్ తీసుకుంటాం. ఈ కనెక్షన్ కు వేరుగా బిల్లు వచ్చేది. స్లాబ్ విధానం అమల్లో ఉండడంతో అధిక బిల్లు నుంచి తప్పించుకోవడం కోసం ఇలా చేసేవాళ్ళు. అయితే విద్యుత్ డిస్కంలు ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా ఎత్తేసి ఇలా వేరుగా కనెక్షన్ తీసుకున్న వారిని కూడా కామన్ సర్వీస్ కింద చేర్చి బిల్లు వడ్డించనున్నారు. 

 

ఈ వంటిల్లు లెక్కేంటి? 

 

విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఎన్ని వంట గదులు ఉంటే అన్ని కనెక్షన్లు ఇవ్వొచ్చు కానీ అంతకంటే ఎక్కువ కనెక్షన్లు ఇవ్వడానికి లేదు. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి కొందరు అధికారులు అక్రమంగా కనెక్షన్లు ఇచ్చారని డిస్కంలు గుర్తించాయి. వీరందరిని క్షేత్ర స్థాయిలో గుర్తించి ఈ కనెక్షన్లను కామన్ సర్వీస్ కిందకు తీసుకురానున్నారు. కామన్ సర్వీస్ అంటే 200 యూనిట్ల లోపు ఒకటే బిల్లు వసూల్ చేస్తారు. ఇక 200 ఆపై రూ 7.20 ప్రకారం ఛార్జ్ చేస్తారు. ఈ లెక్కన 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి షాక్ తగలనుంది. 

 

డిస్కంల ప్రతిపాదనపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు డిస్కంలు ఈ అక్రమ కనెక్షన్ల వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అంటున్నాయి. ఏదీ ఏమైనా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే చార్జీల వడ్డనకు సిద్ధం అయ్యాయి డిస్కంలు. మరికొద్ది రోజుల్లోనే ప్రీ-పెయిడ్ మీటర్లను ప్రతీ ఇంటికి అందుబాటులోకి తేనున్నాయి డిస్కంలు. ఇవి కనుక అమల్లోకి వస్తే మొబైల్ రీఛార్జ్ మాదిరిగా విద్యుత్ రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: